CM Revanth Reddy New Team: సీఎం రేవంత్ రెడ్డి కొత్త టీమ్ లిస్ట్ ఇదే.. ఐటీ హెడ్ ఎవరో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీఎంవో కొత్త టీమ్ మీద ఫోకస్ పెట్టారు. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ పాలనలో కీలకస్థానాల్లో ఉన్న ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను మారుస్తూ, నిజాయితీగా, సమర్ధంగా పనిచేసే అధికారులను కీలక స్థానాల్లో నియమిస్తున్నారు.

New Update
BIG BREAKING:  రేవంత్ సంచలన నిర్ణయం.. మేడిగడ్డ, అన్నారంపై విచారణ

సీఎం ఆఫీసులో పని చేసే అధికారుల ఎంపిక మీద రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్ ల బదీలీలు జరిగే అవకాశం ఉందని తెలస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో మూడు కమిషనరేట్ల పరిధిలోని కమీషనర్లు బదిలీ అయ్యారు. దీని తర్వాత శాఖల సమీక్షలు పూర్తికాగానే బదిలీలు ఉంటాయని...పలువురు అధికారుల జాబితా కూడా సిద్ధమైందని చెబుతున్నారు. ఒకే స్థానంలో ఏళ్ళ తరబడి పనిచేస్తున్న అధికారులకు స్థాన చలనం ఉంటుందని అంటున్నారు.

Also Read:తెలంగాణ తొలి దళిత స్పీకర్ గా గడ్డం ప్రసాదరావు…బ్యాక్ గ్రౌండ్ ఇదే.

సీఎంవో కొత్త టీమ్ లో మొదటగా చెప్పుకోవాల్సిన ఆఫీసర్ ఐఏఎస్ ఆమ్రపాలి. ఇప్పటివరకు పీఎమ్వోలో పనిచేసిన ఈమె రేవంత్ రెడ్డి టీమ్ లో జాయిన్ కానున్నారని చర్చ జరుగుతోంది. ఆమ్రపాలి పీఎంవో పదవీ కాలం అక్టోబర్ తో ముగిసింది. దీంతో ఈమె తిరిగి తెలంగాణకు వచ్చేశారు. వచ్చిన వెంటనే కొత్త సీఎం రేవంత్ ను కలవడంతో ఈమె కచ్చితంగా సీఎంవో టీమ్ లో జాయిన్ అవుతారని చెబుతున్నారు.

టీమ్‌ను ఎంపిక చేసుకోవటంలో రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన తీరును అనుసరిస్తున్నారు. ఇన్నిరోజులు ప్రధాన్యతలేని పోస్టుల్లో కొనసాగుతున్న నిజాయితీగల ఆఫీసర్లను.. నిరాదరణకు గురైన సమర్థులను వెతికి మరీ వారికి అవకాశం కల్పిస్తున్నారు. సిన్సియారిటీకి పెద్దపీఠ వేస్తున్నారు. కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రాధాన్యత గల పోస్టులను కట్టబెడుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు, పీఆర్వోలు, తన వ్యక్తిగత సిబ్బంది విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రేవంత్ రెడ్డి ఎంపిక చేస్తున్నారు. మినీ సెక్రటేరియట్‌గా ఉండే ముఖ్యమంత్రి కార్యాలయానికి సీఎం రోజువారీ వ్యవహారాలను నిర్వహించడానికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ముగ్గురు సెక్రటరీ స్థాయి అధికారులు అవసరం.ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వి.శేషాద్రిని నియమిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మేరకు ఉత్తర్వులు వెలువడలేదు. మరోవైపు ముఖ్యమంత్రి కార్యదర్శిగా షానవాజ్ ఖాసింను నియమించారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను సీమ్వో సెక్రటరీగా నియమించడం ఇదే మొదటిసారి.

వీరితో పాటూ 2003 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ లోకేష్ కుమార్ ను కూడా సీమ్వో టీమ్ లోకి తీసుకురానున్నరని వార్తలు వస్తున్నాయి. ఈయన ప్రస్తుతం ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా అడిషనల్ సీఈవో గా పని చేస్తున్నారు. అక్కడ రిలీవ్ ఇవ్వగానే ఇక్కడకు వచ్చి లోకేష్ జాయిన్ అవుతారని చెబుతున్నారు. అంతకు ముందు లోకేష్ జీహెచ్ఎంసీ కమీషనర్గా నాలుగు ఏళ్ళు పని చేశారు.

వీరి తర్వాత బీసీ వెల్ఫేర్ సెక్రటరీ బుర్రా వెంకటేశాన్ని సీమ్వో ఆఫీసర్ గా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ స్వెర్జ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ దానా కిశోర్ ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీగా నియమించే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న అరవింద్ కుమార్ ను బదిలీ చేస్తారని చెబుతున్నారు. మరోవైపు 1992 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ జాజును ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఆఫీసర్ గా నియమించనున్నారు. ప్రస్తుతం ఈ పదవిలో జయేష్ రాజన్ ఉన్నారు. ఇక స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అయిన కె. రామారావును మాత్రం కొన్నాళ్ళ పాటూ కంటిన్యూ చేయనున్నారు. మూడు నెలల తర్వాత వచ్చే తెలంగాణ స్టేట్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టేంతవరకు ఈయన ఉంటారని చెబుతున్నారు. దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్ మెంట్లో కీలక పదవికి రామారావు వెళతారని సమాచారం. ఇక చివరగా దాసరి రవి చందన కమర్షియల్ టాక్సస్ కమీషనర్ గా గాని, హెల్స్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ గా గాని నియమిస్తారని తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు