Telangana Mega Dsc: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. ఈరోజు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పదేళ్లు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాక నిరాశ, నిస్పృహతో ఉన్న డీఎస్సీ అభ్యర్థులకు త్వరలో మెగా డీఎస్సీ నోటికేషన్ ఇచ్చి వారికి ఉద్యోగాలు అందిస్తామని అన్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అన్నారు.
మీ త్యాగం మరువం..
చేవెళ్లలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ కోసం కొట్లాడిన ప్రజల త్యాగం మర్చిపోమని అని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి తెచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల రుణం తీర్చుకునే సమయం వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రజల కష్టం ఉందని వ్యాఖ్యానించారు.
ALSO READ: నన్ను చంపేస్తారు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మోసం చేసింది..
కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పదేళ్లు పాలించి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ వర్గాల ప్రజలను మోసం చేసిందని అన్నారు సీఎం రేవంత్. తమ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే హామీల అమలు దిశగా అడుగులు వస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలకు కడుపు మండుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో మోసపోయిన నిరుద్యోగులకు త్వరలో మెగా డీఎస్సీ ఇస్తామని తేల్చి చెప్పారు.
కేటీఆర్ కు సవాల్..
మాజీ మంత్రి కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒక్క సీటు అయినా గెలిచి చుపియాలని అన్నారు. కేసీఆర్ వస్తాడో.. కేటీఆర్ వస్తాడో చూద్దాం అని పేర్కొన్నారు. కేటీఆర్ లాగా నాన్న పేరు చెప్పుకొని తాను కుర్చీలో కూర్చోలేదని.. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి సీఎం అయ్యాను అని కేటీఆర్ పై సెటైర్లు వేశారు.
వాళ్లని తన్నండి..
తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. ప్రభుత్వం కూలిపోతుందని ఎవరైనా అంటే వాళ్లను కాలుతో తన్నండి అని పిలుపునిచ్చారు సీఎం. మరో పదేళ్లు అధికారంలో ఉండేది తమ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.