Lok Sabha Elections: జగన్ ముందు మీ అమ్మ, చెల్లెకు సమాధానం చెప్పు!

ఏపీ సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ఏపీలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని, ముందు తన కన్న తల్లి, చెల్లెకు జగన్ సమాధానం చెప్పాలంటూ విమర్శలు గుప్పించారు. ఏసీలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యత తనపై ఉందన్నారు.

New Update
Lok Sabha Elections: జగన్ ముందు మీ అమ్మ, చెల్లెకు సమాధానం చెప్పు!

TS CM Revanth Reddy Fired On AP CM Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం కడపలో ప్రచారం నిర్వహించిన జగన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే తమ ఓట్లు చీల్చి, చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ ఏపీసీసీ షర్మిలపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. అంతేకాదు చంద్రబాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తున్నాడని, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత ఎన్నికల కోసం నాన్న సమాధి దగ్గరకు ఢిల్లీ నుంచి వస్తారట అంటూ రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy: ఆయన నా గురువు కాదు.. సహచరుడు.. చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 

అయితే దీనిపై హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’లో స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం జగన్‌ మాటలను కన్న తల్లి, సొంత చెల్లెలు కూడా నమ్మట్లేదన్నారు. నా మీద ఎలాంటి ఆరోపణ చేసిన దానికి విలువ లేదన్నారు. సొంత చిన్నాన్నకు జరిగిన అన్యాయం, వారి కుటుంబ పరిస్థితులు, ఏపీలో ఉన్న వాతావరణంగురించి ప్రజలే చెబుతున్నారు. చెల్లె, తల్లి అడుగున్న ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాల్సిదే. ఆయన కుటుంబం గురించి రాజకీయ వేదికలపై బహిరంగ చర్చ నడుస్తోంది. కాబట్టి జగన్ దానిపై మీద దృష్టి పెడితే మంచిదన్నారు. అలాగే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అని, చంద్రబాబు పట్ల అభిమానం ఉంది కానీ రాజకీయాంగా ఎలాంటి సంబంధాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత తనపై ఉందని, కాబట్టి ఏపీలో కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకురావాడానికి తన వంతు బాధ్యత వహిస్తానన్నారు. ఏఐసీసీ పార్టీ ఆదేశాల మేరకు అందరం పనిచేస్తామని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు