MLC Elections : ఢిల్లీలో సీఎం రేవంత్.. కోటి ఆశలతో కోదండరాం!

ఢిల్లీ పర్యటనలో ఉన్నారు సీఎం రేవంత్. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు, ఎంపీ టికెట్లపై ఆయన ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే గవర్నర్ కోటాలో కోదండరాంకు ఎమ్మెల్సీ టికెట్ ఖాయమైనట్లు సమాచారం. దీనిపై రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

New Update
MLC Elections : ఢిల్లీలో సీఎం రేవంత్.. కోటి ఆశలతో కోదండరాం!

Congress MLC List : తెలంగాణ(Telangana) సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఢిల్లీ(Delhi) పర్యటనలో ఉన్నారు. నిన్న (శుక్రవారం) ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్(Congress) జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) తో భేటీ కానున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆయన అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే.. ఎంపీ ఎన్నికలు, ఎమ్మెల్సీ టికెట్స్, నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టికెట్లపై ఆయన హైకమాండ్ తో చర్చించనున్నారు.

ALSO READ: ఆ పరిస్థితిలో కేటీఆర్ లేడు.. జీవన్ రెడ్డి సెటైర్లు!

ఎమ్మెల్యే కోట్లా ఎమ్మెల్సీపై కొట్లాట..

తెలంగాణలో ఈ నెల 29వ తేదీన జరగబోయే రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టే కాబట్టి ఆ రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకే వచ్చే అవకాశం నిండుగా కనిపిస్తోంది. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆ రెండు స్థానాల్లో ఎవరిని నిలబెడుతుందనే చర్చ అటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ మోడలింది. రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీలో అంతర్గతం గా చాలామంది పోటీ పడుతుండగా, సీఎం ఢిల్లీ వెళ్లడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

అద్దంకికి అడ్డు క్లియర్?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్(Addanki Dayakar)  ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యే స్థానంపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ విజయం కోసం తన టికెట్ ను వదులుకున్న అద్దంకికి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ(Deepa Das Munshi) ఇప్పటికే సీఎం రేవంత్ అభిప్రాయాన్ని తీసుకుని అధిష్టానానికి నివేదించారు. కాగా ఈ స్థానాల కోసం ఎస్సీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గానికి చెందిన నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలి స్తోంది. అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఫిరోజాఖాన్, అజారుద్దీన్ తో పాటు చిన్నారెడ్డి తదితరులు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. మరి అద్దంకికి హస్తం హ్యాండ్ ఇస్తుందా? లేదా ఆశిస్తున్నా టికెట్ ఇస్తుందా? అనేది వేచి చూడాలి.

కోటి ఆశలతో కోదండరాం..

గవర్నర్ కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులు, ఎమ్మెల్యే నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్నగర్(Mahabub Nagar) స్థానిక సంస్థల కోటా స్థానం భర్తీపై కూడా హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతుండగా, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది.

Advertisment
తాజా కథనాలు