Telangana Congress Manifesto: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల్లోని ఒకటైన అయిన మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) కింద తెలంగాణలోని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో (Free Bus Scheme) పాటు ఆరోగ్యశ్రీ కార్డు రూ.10లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. మహిళలు తమ గుర్తింపు కార్డు చూపించి తెలంగాణలో ఎక్కడికైనా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో టికెట్ కు డబ్బు చెల్లించకుండా ఉచితంగా ప్రయాణించొచ్చి.
ALSO READ: మా వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. హరీష్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతించగా.. ఆటో డ్రైవర్లు (Auto Drivers) దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కలిపించడం వల్ల తమకు గిరాకీ తగ్గుతుందని.. ఆటోలో ఎవరు ఎక్కడం లేదని.. దీని వల్ల తమకు ఆదాయం తగ్గుతుందని అవేదం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం తమకు శాపంగా మారిందని.. దీని ద్వారా తమ కుటుంబాలు రోడ్లపైకి వస్తాయని..ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు పిలుపునిచ్చాయి ఆటో సంఘాలు. రోజుకు రూ.వెయ్యి ఆదాయం చూపాలంటు ఆటోడ్రైవర్లు ఆందోళనలు చేస్తున్నారు.
ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు...
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అంటే ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని తెలిపింది. వారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి రూ.12000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పోందుపర్చింది. తాజాగా ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం పథకంపై విధివిధానాలు రూపొందించాలంటుంది ప్రభుత్వం. ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తించాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆటో ఓనర్లుకు ఇవ్వాలా.. ఆటో డ్రైవర్లకు ఇవ్వాలా అనే దానిపై ఇంకా క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఆటోలను అద్దెకు ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఓనర్లకు ఇస్తే తమ పరిస్థితి ఏంటని డ్రైవర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్లకు ఇస్తే ఆటో కొన్న తమ పరిస్థితి ఏంటని ఓనర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, ముందుగా దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ నుంచి ఈ స్కీమ్ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ పథకంపై ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ALSO READ: పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలి.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ