CM Revanth Reddy: కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

TG: 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్‌కు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. "మా ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటాం.. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. ఈ సాయంత్రానికి నీ దొడ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో లెక్కపెట్టుకో" అంటూ హెచ్చరించారు.

CM Revanth Reddy: కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి  మాస్ వార్నింగ్
New Update

CM Revanth Reddy: తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని త్వరలో వారు బీఆర్ఎస్ లో చేరుతారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్‌నగర్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై మాటల తూటాలు పేల్చారు. లోక్ సభ ఎన్నికల తరువాత కేసీఆర్ దగ్గర ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారో చూద్దామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆనాడు కేసీఆర్ కరీంనగర్ నుంచి పాలమూరు వలస వచ్చారని అన్నారు.

ALSO READ: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు

కేసీఆర్ ను పాలమూరు నుంచి ఎంపీగా గెలిపిస్తే అప్పుడు ఏం తెచ్చారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ కారు చెడిపోయింది.. ఇక బయటకు రాదని అన్నారు. కేసీఆర్ కారును ఇనుప సమన్లకు వేయాలని చురకలు అంటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారును ప్రజలు బొంద పెట్టారని అన్నారు. తమ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం అని పేర్కొన్నారు.

కేసీఆర్ ఏమన్నారంటే?..

లోక్ సభ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి ఓ కీలక నేత 20 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని చెప్పాడని అన్నారు. ఇప్పుడే వద్దని తాను చెప్పినట్లు పేర్కొన్నారు. పార్టీ మారిన వారు మళ్ళీ టచ్ లోకి వచ్చారని బాంబ్ పేల్చారు. 

రేవంత్ వ్యవహారశైలి నచ్చక మళ్లీ తనతో టచ్‌లోకి వచ్చారని పేర్కొన్నారు. పార్టీ మారిన వ్యక్తులను కాళ్లు మొక్కినా తిరిగి తీసుకోను అని తేల్చి చెప్పారు. మూడు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది అని ఎద్దేవా చేశారు. 102 ఎమ్మెల్యేలున్నప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చే ప్రయత్నం చేసిందని అన్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్‌కు ఉన్న సీట్లు చూస్తే బీజేపీ కొనడం ఎంత సేపు అని కొత్త చర్చకు కేసీఆర్ తెర లేపారు.

కేవలం డబ్బులతో గెలుస్తామంటే కుదరదు, జనాల్లో కష్టపడాలని అన్నారు. రాబోయే రోజులు ముమ్మాటికి బీఆర్ఎస్‌వే అని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాం అని బీఆర్ఎస్ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను చూస్తారని అన్నారు.

#brs-chief-kcr #cm-revanth-reddy #lok-sabha-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి