Telangana: అసెంబ్లీని కూలుస్తారా? సీఎం రేవంత్ సంచలన రిప్లై..! తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, నూతన అసెంబ్లీ భవనం కడతారంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఆడంబరాలకు పోయేది లేదని, కొత్త బిల్లింగ్‌లు కట్టేది లేదని తేల్చి చెప్పారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోనే సీఎం క్యాంప్ ఆఫీస్ చిన్నగా నిర్మిస్తామని చెప్పారు. By Shiva.K 14 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana CM Camp Office: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే.. పలు విషయాల్లో సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్కు చూపిస్తున్నారు. ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ విషయంలోనూ.. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఇవ్వగా.. క్యాంప్ ఆఫీసుకు కొత్త భవనం అవసరం లేదని తన నిర్ణయాన్ని తెలిపారు రేవంత్ రెడ్డి. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం క్యాంప్ ఆఫీస్ విషయాన్ని ప్రస్తావించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ)లోని ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకుంటామని తెలిపారు. ప్రజాభవన్‌లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని కూడా ఉపయోగించుకుంటామన్నారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో ఉన్న ఖాళీ స్థలంలో సీఎం క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం చేశారు. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామన్నారు. ముఖ్యమంత్రిగా తాను ఎలాంటి ఆడంబరాలకు పోదల్చుకోలేదని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దుబారాను తగ్గించాలనుకుంటున్నానని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లేదని.. ఇందుకోసం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ఒక ఎకరం స్థలంలో ఆడంబరాలు లేకుండా క్యాంపు ఆఫీస్ నిర్మించుకుని.. దాన్ని వాడుకోనున్నట్టు తెలిపారు. అయితే.. అక్కడ భవనాన్ని నిర్మించాలంటే కోట్లాది రూపాయల ఖర్చవుతుందని.. అందువల్లే ఒక షెడ్డును కట్టించుకుని దాన్నే క్యాంప్ కార్యాలయంగా వాడుకుంటానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే నేడు శాసనసభలో జరిగే బీఏసీ సమావేశంలో సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. శాసనసభ భవనాలనూ.. రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి భవనాలను నిర్మించబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాసనసభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని చెప్పారు. పాత అసెంబ్లీ బిల్డింగ్‌లో కౌన్సిల్ సమావేశాలు.. ఇప్పుడు ఉన్న అసెంబ్లీ లో శాసనసభ జరుగుతుందన్నారు. పార్లమెంట్ తరహాలోనే అసెంబ్లీ ఉండబోతోందన్నారు. ఇక కొత్త వాహనాలు సైతం కొనబోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. Also Read: రైతన్నలకు శుభవార్త.. రూ. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడంటే..! ఇంత అందంగా అమ్మాయి కూడా అలగదేమో.. క్యూట్ వీడియో అస్సలు మిస్సవ్వొద్దు..! #telangana-cm-revanth-reddy #telangana-assembly #telangana-cm-camp-office మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి