CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం!

సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర సభకు ముంబైకి బయలుదేరారు సీఎం రేవంత్. ఈ క్రమంలో సాంకేతిక లోపం వల్ల రేవంత్ ప్రయాణించాల్సిన విమానం నిలిచిపోయింది. గంట నుంచి విమానంలోనే ఉన్నారు రేవంత్.

New Update
CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం!

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం వల్ల ఇండిగో విమానం నిలిచిపోయింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ ముంబై పర్యటన ఆలస్యం కానుంది. సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షి ఉన్నారు. ముంబైలో రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర సభకు వారు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు గంట నుంచి వారు శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్నారు.

ALSO READ: ఎన్నికల ఫలితాల తేదిని మార్చిన ఎన్నికల కమిషన్ 

ఎమర్జెన్సీ ల్యాండింగ్..

ముంబైలో రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర సభకు హాజరు అయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అయితే.. ఈసారి ప్రత్యేక విమానంలో కాకుండా పబ్లిక్ ఫ్లైట్ లో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం రేవంత్ ముంబైకి వెళ్లేందుకు ఇండిగో విమానం ఎక్కారు. టేక్ ఆఫ్ అయిన విమానం ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ చాకచక్యంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ క్రమంలో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

దాదాపు రెండు గంటలు..

సాంకేతిక లోపం వల్ల నిలిచిపోయిన విమానంలో దాదాపు రెండు గంటల సేపు ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం సాంకేతిక లోపాన్ని సిబ్బంది సరి చేయడంతో విమానం టేక్ ఆఫ్ అయింది. ఈ క్రమంలో రెండు గంటలు ఆలస్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముంబైకి వెళ్లనున్నారు. అక్కడ రాహుల్ గాంధీ సభకు అతిథిగా సీఎం రేవంత్ ఉండనున్నారు. సభలో సీఎం రేవంత్ ప్రసంగం ఉండనున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు