ప్రస్తుతం సోషల్ మీడియాలో కుమారీ ఆంటీ ట్రెండింగ్‌లో అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె స్ట్రీట్‌ఫుడ్ తినేందుకు చాలామంది అక్కడికి వస్తున్నారు. అంతేకాదు మరికొందరైతే కేవలం ఆమెను చూసేందుకు మాత్రమే వస్తున్నారు. దీంతో ఆమె నడిపిస్తున్న హోటల్‌కు వచ్చేవారి సంఖ్య ఎక్కువ కావడంతో.. ట్రాఫిక్ సమస్య వల్ల పోలీసులు ఆమె షాప్ మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కుమారీ ఆంటీకి కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఆమె తన ఫుడ్ సెంటర్‌ను రీ ఓపెన్ చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించడమే ప్రజాపాలన అని.. పేద ప్రజల వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. అయితే మరికొద్ది సేపట్లో రేవంత్ ఆమెను కలవనున్నట్లు సమాాచారం.
Also Read: గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం!
వారం రోజులు మూసేయాలి
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఎక్కడ చూసిన ఈమెకు సంబంధించిన రీల్స్, మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. రోజుకి దాదాపు 500లకు పైగా కస్టమర్లు ఇమే ఫుడ్ పాయింట్ వద్దకు వచ్చేందుకు ఎగబడుతున్నారు. రోజురోజుకి జనాలు ఎక్కువైపోవడంతో.. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఫుడ్ సెంటర్‌కు అనుమతి లేదనే కారణంతో దీన్ని తొలగించాలని పోలీసులు ఆదేశించారు. వారం రోజుల పాటు ఫుడ్ సెంటర్‌ను మూసేయాలని చెప్పారు. కానీ పక్కనే ఉన్న వ్యాపారులకు తమ బిజినెస్‌లు చేసుకోవచ్చని చెప్పారు.
ఇలా జరిగిన తర్వాత కుమారీ ఆంటీ మీడియా వాళ్లతో మాట్లాడిన వీడియో క్లిప్స్ కూడా వైరల్ అయ్యాయి. దీంతో నెటీజన్లు పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఇలా ఆమె ఫుడ్ సెంటర్‌ను క్లోజ్ చేయించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ స్పందించారు. ఆమె ఫుడ్‌సెంటర్‌ను అక్కడే రీ ఒపెన్ చేయించాలని పోలీసులకు ఆదేశించారు.
Also read: మరో వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు విడుదల