కవిత బెయిల్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

TG: ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుండడంతో కవిత బయటకు వచ్చిందని ఆరోపించారు. ఈ కేసులో అరెస్టైన కేజ్రీవాల్, సిసోడియాకు చాలా కాలం బెయిల్ రాకపోవడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు.

New Update
కవిత బెయిల్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy On Kavitha Release: మీడియాతో చిట్ చాట్ లో తెలంగాణ రాజకీయాల్లో రచ్చ లేపుతున్న హైడ్రా, రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితం అని అన్నారు.హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్, పార్కులు, నాలాల కబ్జాలే మా మొదటి ప్రాధాన్యం అని చెప్పారు. ప్రజా ప్రయోజనాలు తమకు ముఖ్యం.. చెరువులు కబ్జా చేసిన ఎవరిని వదిలిపెట్టం అని స్పష్టం చేశారు.

ఓఆర్‌ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలో ఉన్నాయని అన్నారు. ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు డ్రైనేజ్‌ను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లోకి వదులుతున్నారని చెప్పారు. ఆ నీళ్లు హైదరాబాద్‌ ప్రజలు తాగాలా.? అందుకే కూల్చివేతలు అని క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్‌ ఫామ్‌హౌస్ లీజ్‌కు తీసుకున్నట్టు చెబుతున్నారని.. లీజు విషయాన్ని అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదని నిలదీశారు. కేటీఆర్‌ను డిస్‌క్వాలిఫై చేయాలని అన్నారు.

నిబంధనలు అతిక్రమించి ఫామ్‌హౌస్‌లు కడితే ఎలా? అని ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతల విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్షం అంటూ లేదని అన్నారు. మొదట కూల్చింది కాంగ్రెస్ నేత పళ్లంరాజు నిర్మాణాన్నే అని అన్నారు. జన్వాడ ఫామ్‌హౌస్‌కు గ్రామ పంచాయతీ అనుమతులు లేవని చెప్పారు. ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలను హైకోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తుందని తెలిపారు. హైడ్రాకు పోలీస్‌ స్టేషన్ స్టేటస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అక్రమ నిర్మాణాలు ఉంటే మాకు లిస్ట్ ఇవ్వండి.. నిలబడి కూల్చేస్తాం అని అన్నారు. 111 జీవోను గత ప్రభుత్వం ఎత్తివేసేందుకు చర్యలు చేపట్టిందని.. కానీ 111 జీవోను అలాగే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

కవిత బెయిల్ పై..

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ బీజేపీకి ట్రాన్స్‌ఫర్ చేశారని అన్నారు సీఎం రేవంత్. అందుకే కవితకు ఐదు నెలల్లో బెయిల్ వచ్చిందని ఆరోపణలు చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న కేజ్రీవాల్, సిసోడియాకు నెలలు దాటినా బెయిల్ రాలేదని అన్నారు.

రుణమాఫీపై...

అందరికీ రుణమాఫీ జరుగుతుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. కలెక్టర్ల దగ్గర గ్రీవెన్స్ పెట్టినట్లు చెప్పారు. హరీష్‌, కేటీఆర్‌ రుణమాఫీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ కానివారి లిస్ట్ కలెక్టరేట్‌లో ఇవ్వండి.. పరిశీలిస్తాం అని అన్నారు. ఇప్పటివరకు రూ.17,933 కోట్లు రుణమాఫీకి జమ చేసినట్లు చెప్పారు. 2 లక్షలకు పైగా ఉన్నవారు.. పైన ఉన్న అమౌంట్‌ కట్టేస్తే రూ.2లక్షల రుణమాఫీ జరుగుతుందని అన్నారు.

Also Read: మల్లారెడ్డి అల్లుడికి హైడ్రా షాక్!

Advertisment
తాజా కథనాలు