CM Revanth Reddy: వైఎస్‌ను కాపీ కొడుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి!

మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి స్టార్ట్ చేసిన చేవెళ్ల సెంటిమెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. ఈ నెల 27న చేవెళ్ల నుంచి 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌, రూ.500 కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు సీఎం రేవంత్.

New Update
CM Revanth Reddy: వైఎస్‌ను కాపీ కొడుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి!

CM Revanth Reddy Following YSR: కాంగ్రెస్‌ మరోసారి చేవెళ్ల (Chevella) సెంటిమెంట్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. అన్నివిధాలా అచ్చొచ్చిన చేవెళ్ల నుంచే కీలక సంక్షేమ పథకాలను (Schemes) ప్రారంభించేందుకు రేవంత్‌ రెడ్డి సర్కార్‌ సన్నాహాలు చేస్తోంది. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి (Y. S. Rajasekhara Reddy) నుంచి కాంగ్రెస్‌కు చేవెళ్ల సెంటిమెంట్‌ ప్రారంభమైంది. ఆ సెంటిమెంట్‌ను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కె. రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి కొనసాగించారు. ఇప్పుడు అదే చేవెళ్ల సెంటిమెంట్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి కూడా కొనసాగించాలని నిర్ణయించారు.

అందుకే ఈ నెల 27న చేవెళ్ల నుంచి గృహజ్యోతి (Gruha Jyothi Scheme), 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ , రూ.500 కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) హాజరుకానున్నారు. ఇక నుంచి కాంగ్రెస్‌ పార్టీ చేపట్టే ఏ కార్యక్రమమైనా, ప్రభుత్వ పథకమైనా చేవెళ్ల గడ్డ నుంచి ప్రారంభించే ఆనవాయితీని కొనసాగించాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించినట్లు సమాచారం. గత ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) చేవెళ్ల సెంటిమెంట్‌ను కొనసాగించారు. కాంగ్రెస్‌ ఎస్సీ డిక్లరేషన్‌ను సైతం చేవెళ్లలోనే ప్రకటించారు సీఎం రేవంత్‌. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు.

Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

ప్రస్తుతం సీఎం రేవంత్‌ రెడ్డి అనుసరిస్తున్న విధానం, ప్రజలతో మమేకమవుతున్న తీరు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి శైలిని గుర్తుచేస్తోంది. అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తూ అదే వేదికపై ఉచిత విద్యుత్‌ ఫైలుపై సంతకం చేసి ప్రజలను ఆకర్షిస్తే.. రేవంత్‌ సీఎంగా ప్రమాణస్వీకార సభలో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తానని ప్రకటించారు. ఇంకోవైపు బేగంపేటలో ప్రజాభవన్‌ కంచెలను తొలగించారు.

పదేళ్ల తర్వాత అదే సెంటిమెంట్‌..

చేవెళ్లకు కాంగ్రెస్‌తో ఏర్పడ్డ సెంటిమెంట్‌ను తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాల్సిందే. 2004లో చేవెళ్ల నుంచి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. అదే సంవత్సరంలో ఎన్నికల శంఖారావాన్నీ అక్కడి నుంచే పూరించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. వైఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత చేవెళ్లలోనే పల్లెబాట, రైతు సదస్సు, ఆరోగ్యశ్రీ పథకం, జైత్రయాత్రలను ప్రారంభించారు. అప్పటి నుంచి చేవెళ్లలో ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం కాంగ్రెస్‌ సీఎంలకు సెంటిమెంట్‌గా మారింది. వైఎస్‌ తరువాత ఈ సెంటిమెంట్‌ను కె.రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి కొనసాగించారు. ప్రభుత్వ పథకాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ఇక్కడి నుంచే మొదలుపెట్టారు. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి ఇదే ఆనవాయితీని కొనసాగించడం విశేషం. ఆనాడు వైఎస్‌ సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల చెల్లెమ్మ అంటే.. ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి సీతక్కను అక్క అంటూ ములుగు నుంచి పాదయాత్ర ప్రారంభించారు.

#200-units-free-current #gas-cylinder-for-rs-500 #ys-rajasekhar-reddy #cm-revanth-reddy
Advertisment
తాజా కథనాలు