CM Revanth: ఎలా అధికారంలోకి వస్తావో చూస్తా.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

నల్గొండ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు కంచరగాడిదను ఇంటికి పంపి.. రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని అన్నారు. త్వరలో ఎలా అధికారంలోకి వస్తారో చూస్తాను అని హెచ్చరించారు.

CM Revanth: ఎలా అధికారంలోకి వస్తావో చూస్తా.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్
New Update

CM Revanth Reddy: నల్గొండ సభలో (Nalgonda BRS Meeting) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth). పాలు ఇచ్చే బర్రెను వదిలి.. దున్నపోతును తెచ్చుకున్నారు అని కేసీఆర్ అన్నదానికి.. తెలంగాణ ప్రజలు కంచరగాడిదను ఇంటికి పంపి.. రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని సీఎం రేవంత్ అన్నారు.

ఎల్బీ స్టేడియంలో జరిగిన 15,750మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 7న ఇదే వేదికలో సోనియా గాంధీ (Sonia Gandhi), ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధి సమక్షంలో ప్రమాణం చేసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో అంత కంటే ఎక్కువ ఆనందంగా ఉందని అన్నారు. మా కుటుంబం అంటే తెలంగాణ ప్రజలు అని పేర్కొన్నారు. పరీక్షలు రాసి ఎదురుచూసి నిరాశకు గురైన వారికి అండగా ఉండాలని కాంగ్రెస్ భావించిందని తెలిపారు.

ALSO READ: ఢిల్లీ సీఎంకు మరోసారి ఈడీ నోటీసులు

2014 లో రాష్ట్రం వచ్చాక నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు (Unemployed Youth) వస్తాయని భావించారని.. కానీ గత ప్రభుత్వం వారి కుటుంబం గురించే ఆలోచించుకున్నారని మండిపడ్డారు. న్యాయస్థానాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించే అవగాహన గత ప్రభుత్వ పెద్దలకు లేదని విమర్శించారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అందరి సమస్యలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. మీ అందరికీ నేను అండగా ఉంటా, ఎలాంటి సమస్యా రానియ్యం ఐ భరోసా ఇచ్చారు.

స్టాప్ నర్స్, సింగరేణి ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చామని అన్నారు. నేడు కానిస్టేబుల్ నియామకాల పత్రాలు ఇస్తున్నాం అని అన్నారు. ఎవరు అడ్డుపడ్డా, కేసీఆర్, హరీష్ చొక్కా లాగు చించుకున్నా అన్ని నియామకాలు పూర్తి చేస్తాం అని తేల్చి చెప్పారు. కొందరు అన్నారు అందరికీ నియామక పత్రాలు ఇంటికే పంపొచ్చు కదా హైదరాబాద్ ఎందుకు పిలవడం అని?... మీ అందరినీ సంతోషంగా చూస్తేనే నాకు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర పడుతుందని సీఎం రేవంత్ అన్నారు. మీ అందరి సంతోషంలో మేము కూడా భాగస్వామ్యులం అవ్వాలని పిలిచాం అని అన్నారు.

కుటుంబ సభ్యులు గెలవక పోతే వెంటనే పదవులు ఇచ్చిన కేసీఆర్...ఈ తెలంగాణ పిల్లలు నీకు ఎం అన్యాయం చేశారు? అని ప్రశ్నించారు. అసెంబ్లీ కి రావడానికి కేసీఆర్ కి ధైర్యం లేదు కానీ నల్గొండ పోయి మాట్లాడుతున్నారు అని ఫైర్ అయ్యారు. ఆడ్డ మీద కొట్లడటం కాదు.. చట్ట సభలోకి రావాలని కేసీఆర్ ను కోరారు.

ఈ రోజు కేసిఆర్ మళ్ళీ నీటి మాట పట్టిండు.. ఎందుకంటే ఆయన దగ్గర మరో ఏ సెంటి మెంటు లేదని విమర్శించారు. మొన్న నల్గొండ సభకు పోతే ప్రజలు కోడిగుడ్లు, టమాటాలు పెట్టీ కొట్టారని ఎద్దేవా చేశారు. నూతనంగా ఎంపికైన కానిస్టేబుల్స్ కి నేను ఒక్కటే చెబుతున్న రాష్ట్రంలో గంజాయిని మాట వినిపించకుడదని అన్నారు. "ఎంపికైన ప్రతి ఒక్కరూ మనసులో ఒట్టేసుకొండి... గంజాయి పై ఉక్కుపాదం మోపుతామని... డ్రగ్స్ రహిత తెలంగాణగా మారనుంది" అని అన్నారు.

DO WATCH:

#kcr #brs-party #congress-party #cm-revant-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe