CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంను ప్రపంచంతో పోటీపడేలా చేయాలన్నదే మా లక్ష్యం అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలలో గత ప్రభుత్వం చేసిన తప్పులపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం అప్పుల విషయంలో ఆర్బీఐ రిపోర్ట్ ను తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సరైన ఉద్దేశంతోనే ఖర్చు చేసిందా లేదా అనేది కాగ్ చెబుతుందని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలిసేందుకు కిషన్ రెడ్డిగారికి ఫోన్ చేసినట్లు తెలిపారు.
Also Read: అప్పుడెక్కడికి వెళ్లారు మీరంతా.. మీడియాకు రాహుల్ కౌంటర్..
2014-15 లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్బీఐ వద్ద 303 రోజులు మిగులు నిధులు ఉండేవని..పదేళ్లలో అది 30 రోజులకు తగ్గిపోయిందని అన్నారు. ఇవి వాస్తవాలని.. వీటిని కప్పిపుచ్చి గొప్పలకు పోతే నష్టపోతామని చెప్పారు. ప్రభుత్వ ఆదాయం, అవసరాలకు సంబంధించి ఆర్బీఐ(RBI) సమాచారం ఇస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. శ్వేత పత్రం ఎవరినో కించపరచడానికో అవమానించడానికో కాదని, ప్రకటించిన గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కాదని, వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే ఈ శ్వేతపత్రం విడుదల చేశామన్నారు.
వ్యయాల విషయంలో కాగ్ రిపోర్ట్ ను తీసుకున్నట్లు వెల్లడించి ఆయన ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా లోన్లు పుట్టని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల విషయంలో ఆర్బీఐ రిపోర్ట్ ను తీసుకున్నట్లు తెలిపారు. పదేళ్లు రాష్ట్రం కోసం పనిచేసిన అధికారులను అవమానించేలా హరీష్ రావు మాట్లాడం దారుణమన్నారు. ప్రతిపక్షంలోకి వెళ్లినందుకు వాళ్లకు దుఖం ఉండవచ్చని కానీ, చేసిన తప్పులను అధికారులపై వేయడం తగదని వ్యాఖ్యనించారు.
బిఆర్ఎస్(BRS) వారి కుటుంబ తగాదాలను సభలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. మా ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయానికి ముందు అఖిలపక్షం సలహాలు, సూచనలు ఉంటాయని వెల్లడించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలను ప్రభుత్వం ఆశించడం లేదని.. వారి సమయంలో పనిచేసిన అధికారులే ఈ లెక్కలిచ్చారని అన్నారు.