CM Revanth Reddy: 'బడే భాయ్' అని పిలిచి మోడీని చిక్కుల్లో పెట్టిన సీఎం రేవంత్!

తెలంగాణలో ప్రధాని మోడీ రెండ్రోజుల పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో 'బడే బాయ్' అని పిలిచి ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కొరకు మొత్తం 11 విజ్ఞప్తులు చేసి చిక్కుల్లో పెట్టారు. అవేంటో తెలుసుకోవాలంటే పూర్తి వార్తను చదవండి.

CM Revanth Reddy: 'బడే భాయ్' అని పిలిచి మోడీని చిక్కుల్లో పెట్టిన సీఎం రేవంత్!
New Update

CM Revanth Reddy: తెలంగాణలో ప్రధాని మోడీ రెండ్రోజుల పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో 'బడే బాయ్' అని పిలిచి ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కొరకు మొత్తం 11 విజ్ఞప్తులు చేసి చిక్కుల్లో పెట్టారు. అవేంటో తెలుసుకోవాలంటే పూర్తి వార్తను చదవండి.

ALSO READ: కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ భేటీ.. బీఆర్ఎస్‌తో బీఎస్పీ పొత్తు!

మోడీని రేవంత్ చేసిన విజ్ఞప్తులు..

1. NTPC లో మరో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.
2. ఎన్నికల సమయంలో మూసి నదిని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని మోడీని ఇదే విషయంపై సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. సబరిమతి నదిని ఏ విధంగా బీజేపీ ప్రభుత్వం శుద్ధి చేసిందో అదే విధంగా మూసి నదిని కూడా ప్రక్షాళన చేయాలని, అలాగే హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించాలని కోరారు.
3. ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు లబ్ది చేకూర్చేందుకు తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించేలా ఒప్పించాలని ప్రధాని మోడీని సీఎం రేవంత్ కోరారు.
4. హైదరాబాద్ - శ్రీశైలం మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని అన్నారు.
5. తెలంగాణలోని తాగునీటి సమస్యను అరికట్టేందుకు ప్రతీ ఇంటికి నీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ పథకానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
6. గత ప్రభుత్వం జిల్లాలు పెంచిందని. పెంచిన జిల్లాల ఆధారంగా తెలంగాణకు అదనంగా 29 మంది ఐపీఎస్ లను కేటాయించాలని అన్నారు.
7. కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు.
8. తెలంగాణ బిడ్డలు పెద్ద చదువులు చదివేందుకు అత్యున్యత విద్యా సంస్థలు అందరికీ అందుబాటులో ఉండేలా హైదరాబాద్ లో ఐఐఎం ను ఏర్పాటు చేయాలని కోరారు.
9. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలకు నిధులు విడుదల చేయాలన్నారు.
10. తెలంగాణలో ప్రోజెక్టుల నిర్మాణానికి నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు అనుమతులు ఇవ్వాలని అన్నారు.
11. తెలంగాణలో సెమీ కండక్టర్లు, డిస్ ప్లే తాయారు కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మరి సీఎం రేవంత్ రెడ్డి కోరిన వాటిని ప్రధాని మోడీ నెరవేరుస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

#modi #cm-revanth-reddy #modi-telangana-tour #modi-meets-cm-revanth #cm-revanth-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి