రాష్ట్రంలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన విషయాల్లో సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డీజే పాండియన్‌ను కోరారు. సచివాలయంలో.. రేవంత్‌ను ఎన్‌డీబీ డీజీ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యవరణాన్ని కాపాడేలా.. కాలుష్యం లేకుండా, సహజ వనరులకు ఎలాంటి విఘాతం కలగకుండా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు.
Also read: మేడిగడ్డ కుంగుబాటు మానవ తప్పిదమే.. రిపోర్టులో కీలక విషయాలు
అలాగే మెట్రో రైలుకి సంబంధించి రెండో దశ ప్రాజెక్టు, నైపణ్యాభివృద్ధి, శిక్షణ కేంద్రాల ఏర్పాటు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వసతి గృహాలు, వ్యర్థ పదార్థాల శుద్ధి కేంద్రాలు, గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సహకరించాలని సీఎం రేవంత్ ఎన్‌డీబీ డీజీ పాండియన్‌ను కోరారు. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని డీజే పాండియన్ హామీ ఇచ్చారు. అయితే ఈ సమావేశంలో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి, సీఎస్ శాంతికుమారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: రేవంత్ సర్కార్ ఉంటదో..ఉండదో..నాకైతే డౌటే..కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!