CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా అన్ని లోక్సభ నియోజకవర్గాలలో జోరుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీని, బీఆర్ఎస్ను టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గురువారం నాడు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో, సిద్దిపేటలో నిర్వహించిన జన జాతర సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్లో మాట్లాడుతూ.. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు పోవడం ఖాయమని అన్నారు. కులగణన చేస్తేనే బీసీలకు రిజర్వేషన్లు పెంచగలమని పేర్కొన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దు కోసమేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ మార్పుపై మాట్లాడుతున్నానని, అందుకే నాపై కేసులు పెట్టారని అన్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: మోడీ కేసులకు భయపడతానా?.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Translate this News: