Hyderabad : రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. 20 ఎకరాల్లో డ్రోన్‌ పోర్ట్‌!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో డ్రోన్‌ పోర్ట్‌ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు అవసరమైన 20 ఎకరాల స్థలాన్ని ఫార్మా సిటీ వైపు అన్వేషించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.

Hyderabad : రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. 20 ఎకరాల్లో డ్రోన్‌ పోర్ట్‌!
New Update

Drone Port :  తెలంగాణ సర్కార్(Telangana Sarkar) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) నగర పరిధిలో డ్రోన్ పోర్ట్ నిర్మాణం చేపట్టనుంది. ఇందుకు కావాల్సిన ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

ఒప్పందంపై సంతకాలు..
ఈ మేరకు ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(NRSP) తో డ్రోన్‌ పైలట్లకు అధునాతన శిక్షణపై తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ అవగాహన డీల్ కుదుర్చుకుంది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్‌ అకాడమీ సీఈవో ఎస్‌.ఎన్‌.రెడ్డి, ఎన్‌ఆర్‌ఎస్‌సీ డైరెక్టర్‌ ప్రకాశ్‌ చౌహన్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు.

20 ఎకరాల భూమి..
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. డ్రోన్ పోర్ట్(Drone Port) కోసం కావాల్సిన 20 ఎకరాల భూమిని ఫార్మా సిటీ వైపు అన్వేషించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏవియేషన్‌ నిబంధనల ప్రకారం అభ్యంతరం లేని జోన్‌లో ఈ స్థలం కేటాయించాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎన్‌ఆర్‌ఎస్‌సీ డిప్యూటీ డైరెక్టర్‌ మురళీకృష్ణ, తదితర అధికారులు ఈ మీటింగ్ లో హాజరయ్యారు.

రద్దీ కారణంగా..
అలాగే ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లోనే డ్రోన్‌ పైలట్లకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు ఏవియేషన్‌ అకాడమీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే అక్కడున్న రద్దీ కారణంగా హైదరాబాద్‌ పరిసరాల్లో డ్రోన్‌ పైలట్ల శిక్షణకు ప్రత్యేక స్థలం కేటాయించాలని సీఎం రేవంత్ ను కోరగా ఆయన సానుకూలంగా‌ స్పందించారు. ఇక డ్రోన్‌ పోర్టు ఏర్పాటుకు ఎంత స్థలం కవాలి, ఎలాంటి నిర్మాణాలు చేపడుతారని అడిగి తెలుసుకున్నారు. పైలట్ల శిక్షణ, డ్రోన్ల తయారీ కంపెనీలు తమ ట్రయల్స్‌ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి : BJP-TDP: టీడీపీ, బీజేపీ పెళ్లి.. రెండు అడుగులు వేయడానికి అంగీకారం!

పునరుద్ధరణపై దృష్టి..
ఈ క్రమంలోనే వరంగల్ పునరుద్ధరణపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. పాడైపోయిన పాత రన్‌ వేలను రీకన్ స్ట్రక్షన్ చేయడంతోపాటు అక్కడి నుంచి కమర్షియల్‌ ఆపరేషన్స్‌ నిర్వహించేలా సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని చెప్పారు. అడ్డంకులేమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని, కొత్తగూడెం, భద్రాచలం పరిసర ప్రాంతంలోనూ విమానాశ్రయం ఏర్పాటుకు అనువుగా ఉంటుందన్నారు.

15 రోజుల ట్రైనింగ్..
ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాస్త్రవేత్తలకు అకాడమీలో శిక్షణ పొందుతున్న డ్రోన్‌ పైలట్లకు డేటా అనాలసిస్‌, డేటా ప్రాసెసింగ్‌, మ్యాపింగ్‌పై 15 రోజుల ట్రైనింగ్ ఇస్తారు. ఎన్‌ఆర్‌ఎస్‌సీ ఒప్పందంలో భాగంగా డ్రోన్‌ పైలెటింగ్‌, డ్రోన్‌ డేటా మేనేజ్‌మెంట్‌, డేటా అనాలసిస్‌, తదితర అంశాలపై కూడా శిక్షణ ఇస్తారు. అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిపోయిందని, పొలాల్లో ఎరువులు, పురుగు మందులను చల్లేందుకు రైతులు డ్రోన్లను వినియోగిస్తున్నారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇక కొన్ని చోట్ల స్వయం సహాయక సంఘాలు వీటిని ఉపాధి మార్గంగా ఎంచుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు. ఉన్నతస్థాయి నుంచి తహసీల్దార్ల స్థాయి వరకు ప్రభుత్వ అధికారులకు కూడా వీటిపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌..
‘దేశంలోనే వినూత్నంగా తెలంగాణ ఈ శిక్షణ కోర్సు నిర్వహిస్తోంది. అవసరమైన సహాయ సహకారాలు అందించినందుకు ముఖ్యమంత్రికి అభినందనలు. శాటిలైట్‌, రిమోట్‌ సెన్సింగ్‌, అంతరిక్ష వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఎన్‌ఆర్‌ఎస్‌సీ.. డ్రోన్‌ టెక్నాలజీని మరింతగా వినియోగించుకునేందుకు ఈ శిక్షణలో భాగస్వామ్యమవుతుంది. దేశంలో 12 సార్లు బెస్ట్‌ ఏవియేషన్‌ అవార్డును అందుకున్న తెలంగాణ ఏవియేషన్‌ అకాడమీ సేవలు అభినందనీయం’ అని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : Valentine’s Day : ప్రేమికుల రోజు… ఈ రాశులకు అదృష్టమే..!

#cm-revanth #telangana #hyderabad #drone-port
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe