Vamshi Chand Reddy: కాంగ్రెస్ తోలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్

కోస్గి సభలో కాంగ్రెస్ తోలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు సీఎం రేవంత్. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును ప్రకటించారు. 50వేల మెజారిటీ ఇచ్చి లోక్‌సభకు పంపాలని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 17కు 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలవాలని పేర్కొన్నారు.

New Update
Vamshi Chand Reddy: కాంగ్రెస్ తోలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్

CM Revanth Reddy Announced Vamshi Chand As MP Candidate: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ (Congress).. మరి కొన్ని నెలల్లో జరగబోయే లోక్ సభ ఎన్నికలపై వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఈరోజు తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. కోస్గిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన తెలంగాణలో మొదటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్ నగర్ (Mahabubnagar MP) ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును ప్రకటించారు. వంశీని 50వేల మెజారితో గెలిపించాలని కోరారు.

కేసీఆర్ కు సిగ్గు రాలేదు..

కోస్గి సభలో (Kosgi Meeting) సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ (Kodangal) ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగా అని అన్నారు. ఆనాడు పార్లమెంటులో నోరులేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారని పేర్కొన్నారు. "ఈ సభా వేదిక నుంచి కేసీఆర్ ను అడుగుతున్నా.. తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు పాలమూరుకు చేసిందేంటి? అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు?, పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వని నీకు ఓట్లు అడిగే అర్హత లేదు.. ప్రజలు ఛీకొట్టినా కేసీఆర్ కు సిగ్గు రాలేదు.. అయ్యా కొడుకులు ఏం మొహం పెట్టుకుని పాలమూరు జిల్లాకు వస్తారు?.. పాలమూరును ఎండబెట్టి.. కొడంగల్ ను పడావు పెట్టి ఎడారి చేశారు.. 70 ఏండ్ల మన గోస తీరుస్తానని మొన్నటి ఎన్నికల్లో మాట ఇచ్చా... ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నా" అని అన్నారు.

బీజేపీకి సవాల్ విసురుతున్న..

"బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డిలను అడుగుతున్నా.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014లో మోడీ ఇచ్చారు. పదేండ్లుగా ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో డీకే అరుణ, కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి సమాధానం చెప్పాలి. కృష్ణా రైల్వే లైన్ ఎందుకు ముందుకు సాగలేదని నేను అడుగుతున్నా.. కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా... నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా.. రాష్ట్రానికి నాలుగు రూపాయలైన తెచ్చారా?, మరి పాలమూరు జిల్లాలో ప్రజలను ఓట్లు వేయాలని ఎలా అడుగుతారు?" అని నిలదీశారు.

14 పార్లమెంటు స్థానాలు గెలిస్తేనే..

కృష్ణా జలాలు కొడంగల్ రైతులకు అందేంచే పని తమ ప్రభుత్వం చేస్తోందని అన్నారు రేవంత్ (CM Revanth Reddy). పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 50వేల మెజారిటీ ఇవ్వాలని అన్నారు. మళ్లీ 5వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చారు.

"కాంగ్రెస్ కార్యకర్తలకు నేను పిలుపునిస్తున్నా.. ఇదివిరామం మాత్రమే.. ఇంకా యుద్ధం ముగిసిపోలేదు.. 17లో 14 పార్లమెంటు స్థానాలు గెలిచినపుడే.. పార్లమెంట్ లో మనం పట్టు సాధించినపుడే యుద్ధం గెలిచినట్టు.. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న బీఆరెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి." అని వ్యాఖ్యానించారు.

Also Read: లిక్కర్ స్కాం కేసులో కవితకు సీబీఐ నోటీసులు

Advertisment
తాజా కథనాలు