Telangana : రైతుబంధుపై మాటల యుద్ధం.. రేవంత్‌ VS బీఆర్ఎస్

మే 9లోగా రైతుల భరోసా అందిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇస్తుంది రైతు బంధేనని.. రైతు భరోసా కాదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రైతు భరోసా అంటే రూ.15 వేలు ఇవ్వాలి.. కానీ సర్కార్‌ కేవలం రూ.10 వేలు ఇస్తోందని విమర్శించారు.

New Update
Telangana : రైతుబంధుపై మాటల యుద్ధం.. రేవంత్‌ VS బీఆర్ఎస్

Rythu Bandhu : తెలంగాణ(Telangana) లో రైతు బంధుపై మాటల యుద్ధం నడుస్తోంది. మే 9లోగా రైతుల భరోసా(Rythu Bharosa) అందిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్(CM REVANTH REDDY) హామీ ఇచ్చారు. ఏ ఒక్కరికి అందకున్న ముక్కు నేలకు రాస్తానని అన్నారు. రైతు భరోసా జమ చేస్తే.. మరి కేసీఆర్‌ ముక్కు నేలకు రాస్తారా అంటూ సవాల్ విసిరారు. అయితే రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ వేశారు. కాంగ్రెస్(Congress) ఇస్తుంది రైతు బంధే.. రైతు భరోసా కాదని అన్నారు. కాదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని అన్నారు.

Also Read: రానున్న 4 రోజుల్లో 48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు..

రైతు భరోసా అంటే రూ.15 వేలు ఇవ్వాలి.. కానీ సర్కార్‌ కేవలం రూ.10 వేలు ఇస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా భరోసా ఇస్తే.. రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తానని జగదీష్ రెడ్డి సవాల్ చేశారు. ఇదిలాఉండగా.. ఇప్పటివరకు 64 లక్షల మందికి రైతుబంధు పంపిణీ జరిగింది. మిగిలిన 4 లక్షల మంది రైతులకు ఈరోజు నుంచి రైతుబంధు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం దాదాపు రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిద్ధం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు