MLA Salaries: ఎమ్మెల్యేల జీతాలు పెంచిన బెంగాల్‌ సీఎం!

బెంగాల్ ముఖ్యమంత్రి (CM) ఎమ్మెల్యేల జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచింది ఒక వెయ్యో రెండు వేలో కాదో ఏకంగా 40 వేలు. ఎమ్మెల్యేల జీతాలను ఒక్కొక్కరికి నెలకు రూ.40 వేలు పెంచుతున్నట్లు మమతా గురువారం ప్రకటించారు.

MLA Salaries: ఎమ్మెల్యేల జీతాలు పెంచిన బెంగాల్‌ సీఎం!
New Update

Mamata Banerjee Announces Salary hike for Bengal MLA: వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న దసరా పండుగ సంబరాలు పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎమ్మెల్యేలకు ముందుగానే వచ్చాయి. ఎందుకంటే బెంగాల్ ముఖ్యమంత్రి (CM) ఎమ్మెల్యేల జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచింది ఒక వెయ్యో రెండు వేలో కాదో ఏకంగా 40 వేలు. ఎమ్మెల్యేల జీతాలను ఒక్కొక్కరికి నెలకు రూ.40 వేలు పెంచుతున్నట్లు మమతా గురువారం ప్రకటించారు.

గురువారం అసెంబ్లీలో ఈ విషయం గురించి ప్రకటించిన మమతా (Mamata Banerjee)..తన జీతంలో మాత్రం ఎటువంటి మార్పు లేదని తెలిపారు. అసలు గత కొన్ని సంవత్సరాల నుంచి మమత ఎలాంటి జీతం కూడా తీసుకోవడం లేదు. ఈ నిర్ణయం ప్రకటించడానికి గల కారణాలను కూడా మమత వివరించారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేల జీతం చాలా తక్కువ. అందుకే ఆమె దసరా ముందు ఈ బంపర్‌ బోనాజా ఆఫర్ ను ప్రకటించినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల జీతం పది వేలు ఉండగా..పెంచిన 40 కలుపుకొని మొత్తంగా వారి చేతికి 50 వేలు అందుతాయి.

మంత్రుల జీతాలు అయితే 10900 నుంచి 50900 కి పెరగనున్నట్లు ప్రభుత్వాధికారులు వివరించారు. ఈ క్రమంలోనే కేబినెట్ మంత్రుల జీతాలు కూడా పెరిగాయి. ఇప్పటి వరకు వారు 11 వేలను అందుకుంటుండగా పెంచిన 40 వేలు కలుపుకొని మొత్తంగా 51 వేలు పెరిగాయి.

అయితే మంత్రులకు, ఎమ్మెల్యేలకు అలవెన్సులు, రవాణా ఖర్చులు, వాహన ఖర్చులు, ఇతరత్రా అవసరాలు అన్ని కలిపి మొత్తంగా ఒక్కొ ఎమ్మెల్యేకు లక్ష రూపాయలకు పైగా అందుతున్నాయి.

Also Read: డీఎంకే కి కొత్త అర్థం చెప్పిన బీజేపీ నేత!

#mamata-banerjee #cm #west-bengal #mla #salary-hike-for-bengal-mla #mamata-banerjee-announces-salary-hike-for-bengal-mla #mamata-benarjee
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe