CM Kejriwal: మోదీపై యుద్ధం.. సీఎం కేజ్రీవాల్ సంచలన మేనిఫెస్టో

బీజేపీపై యుద్దానికి సిద్ధమయ్యారు సీఎం కేజ్రీవాల్. ఈరోజు 10 గ్యారెంటీలతో లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉచిత విద్య- వైద్యం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.

CM Kejriwal: మోదీపై యుద్ధం.. సీఎం కేజ్రీవాల్ సంచలన మేనిఫెస్టో
New Update

Arvind Kejriwal's 10 Guarantees Manifesto: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీపై యుద్దానికి సిద్ధం అయ్యారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ పై విడుదలైన ఆయన శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీపై, మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఆయన లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) 10 గ్యారెంటీలతో ఉన్న మేనిఫెస్టోను విడుదల చేశారు. దేశంలో 24 గంటల ఉచిత కరెంటు (Free Current), ఉచిత విద్య (Free Education), చైనా నుంచి భూమిని స్వాధీనం చేసుకోవడం, ఢిల్లీకి రాష్ట్ర హోదా తదితర అంశాలు 10 హామీల్లో ఉన్నాయి.

సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "ఈ రోజు మనం లోక్‌సభ ఎన్నికలు 2024 కోసం '10 హామీలను' ప్రకటించబోతున్నాం. నా అరెస్ట్ కారణంగా ఇది ఆలస్యమైంది, అయితే ఇంకా చాలా దశల ఎన్నికలు మిగిలి ఉన్నాయి. నేను ఇండియా కూటమితో దీని గురించి చర్చించలేదు కానీ ఇది ఎవరికీ ఎటువంటి సమస్యలు ఉండదనే హామీ లాంటిది. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలను అమలు చేసేలా చూస్తానని హామీ ఇస్తున్న" అని అన్నారు.

Also Read: అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఎఫెక్ట్.. ముగ్గురు పోలీసు అధికారులకు ఈసీ షాక్!

"నేడు మన దేశంలో మన ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి బాగా లేదు. మా మూడవ హామీ మెరుగైన ఆరోగ్య సంరక్షణ. అందరికీ మంచి వైద్యం అందిస్తాం. ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో మొహల్లా క్లినిక్‌లు తెరవబడతాయి. జిల్లా ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తాం. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందుతుంది. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వైద్యం కోసం 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము" అని వ్యాఖ్యానించారు.

అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన 10 హామీలు..

1. దేశవ్యాప్తంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో 24 గంటల విద్యుత్ సరఫరా
2. విద్యకు భరోసా: అందరికీ ఉచిత విద్యనందించే ఏర్పాట్లు చేస్తామని, ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
3. ఆరోగ్యానికి గ్యారంటీ: ప్రైవేట్ ఆసుపత్రులతో సమానంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు నిర్మించబడతాయి.
4. భారత్‌కు చెందిన భూమిని చైనా నుంచి విముక్తి చేయాలని, సైన్యానికి స్వేచ్ఛను ఇస్తాము.
5. మోదీ ప్రభుత్వం ప్రారంభించిన అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేస్తాము.
6. MSP హామీ: రైతులకు పూర్తి మద్దతు ధర కలిగిస్తాం.
7. రాష్ట్ర హోదా హామీ: ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తాం.
8. ఉపాధి హామీ: ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాము.
9. అవినీతికి వ్యతిరేకంగా హామీ: అవినీతిపరులకు సురక్షితమైన స్వర్గధామాన్ని అందించే విధానాన్ని తొలగిస్తామని, అవినీతి నుండి దేశాన్ని విముక్తి చేస్తామని హామీ ఇచ్చారు.
10. GSTపై హామీ: వస్తువులు, సేవల పన్ను (GST) సరళీకృతం చేయడానికి ప్రణాళికలు, చైనా వాణిజ్య సామర్థ్యాన్ని అధిగమించడం.

#delhi #lok-sabha-elections-2024 #arvind-kejriwal #cm-kejriwal-manifesto
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe