Nandyala: నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డిపై ఈసీ సీరియస్ అయింది. ఎన్నికలకోడ్ అమలు చేయడంలో విఫలమయ్యాడంటూ విచారణకు ఆదేశించింది. శాఖపరమైన విచారణ జరపాలని డీజీపీకీ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీ రఘువీరాతోపాటు డీఎస్పీ రవింద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆదివారం రాత్రి 7 గంటలలోపు చార్జ్ షీట్ ఫైల్ చేయాలని సీఈసీ స్పష్టం చేసింది. 144 సెక్షన్ అమల్లో ఉన్నా జన సమీకరణను అరికట్టలేకపోయారని, ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారంటూ నంద్యాల పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిపై శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..AP: అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఎఫెక్ట్.. ముగ్గురు పోలీసు అధికారులకు ఈసీ షాక్!
నంద్యాలకు అల్లు అర్జున్ రావడంతో భారీగా జనం గుమి కూడిన ఘటనపై ఈసీ సీరియస్ అయ్యింది. 144 సెక్షన్ అమల్లో ఉన్నా జన సమీకరణను అరికట్టలేకపోయారని, ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారంటూ ఎస్పీ, డీఎస్పీ, సీఐపీ విచారణకు ఆదేశించింది ఈసీ.
Translate this News: