సీఎం కేసీఆర్ కు కోటి రూపాయిల అప్పు ఇచ్చిన నేత.. ఎవరంటే? తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ నాయకుల ఆస్తులు, అప్పుల యొక్క వివరాల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి అఫిడవిట్ లో పేర్కొన్న వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా వివేక్ నిలిచారు. By V.J Reddy 12 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KCR Took Loan From Vivek: తెలంగాణలో ప్రస్తుతం ఏం నడుస్తుంది అంటే రాజకీయ నాయకుల ఆస్తుల వివరాల ట్రెండ్ నడుస్తుందనే చెప్పాలి. ఎన్నికల నామినేషన్ల పర్వం నవంబర్ 10వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 5,716 నామినేషన్లు దాఖలైనట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) కార్యాలయం వెల్లడించింది. అయితే, ప్రస్తుతం నామినేషన్ల పత్రాలలో రాజకీయ నాయకులు పేర్కొన్న ఆస్తుల వివరాలపై తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నవారు ఎక్కువ ఆసక్తిగా చూస్తున్నారు. ఎవరి దగ్గర ఎంత సొమ్ము ఉందని లెక్క కడుతున్నారు పబ్లిక్. ALSO READ: గువ్వల బాలరాజుపై దాడి.. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే? ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి సొంత గూటి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి (Vivek Venkatswamy) ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తుల వివరాలు చర్చకు దారి తీశాయి. తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అత్యంత ధనిక వ్యక్తిగా వివేక్ వెంకటస్వామి నిలిచారు. తన మొత్తం ఆస్తి విలువ రూ.606.2 కోట్లుగా అఫిడవిట్‌లో వివేక్ పేర్కొన్నారు. చరాస్తుల రూపంలో రూ.380.76 కోట్లు, స్థిరాస్తుల రూపంలో రూ.225.91 కోట్ల ఆస్తి ఉందని తెలిపారు. రూ.45.44 కోట్లు అప్పు ఉందని అఫిడవిట్‌లో వెల్లడించారు. ఇదిలావుండగా సీఎం కేసీఆర్ (KCR) వివేక్ వెంకటస్వామి వద్ద అప్పు తీసుకున్నాడట. సీఎం కేసీఆర్ ఏంటి.. వివేక్ దగ్గర అప్పు తీసుకోవడం ఏంటని అనుకుంటున్నారా?.. నిజమే ముఖ్యమంత్రి కేసీఆర్ కు రూ.1.06 కోట్లు అప్పు ఇచ్చానని వివేక్ వెంకటస్వామి స్వయంగా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. మరి కేసీఆర్.. వివేక్ దగ్గర ఎందుకు అప్పు తీసుకున్నారో వారిలో ఒకరు చెబితేనే తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కూడా వివేక్ వెంకటస్వామి దగ్గర కోటిన్నర రూపాయలు అప్పుగా తీసుకున్నారని పేర్కొన్నారు. ALSO READ: అది జరిగితే కేసీఆర్, కేటీఆర్, కవిత జైలుకే… RS ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు ఇక వివేక్ వెంకటస్వామి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెన్నూరు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఉన్నారు. #kcr #telangana-elections #vivek-venkataswami #richest-mla-candidate-in-telangna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి