Telangana Elections 2023: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. సీఎం కేసీఆర్ చివరి ప్రచారం ఎక్కడంటే..

తెలంగాణలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. ప్రచార గడువు ముగిసిన వెంటనే స్థానికేతర నేతలు నియోజకవర్గాలను వదివెళ్లాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. చివరి రోజు కావండతో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌, వరంగల్‌లో ఎన్నికల ప్రచారాలు నిర్వహించనున్నారు.

New Update
TS News: హైదరాబాద్‎లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ? ఈ సారి గులాబీ బాస్ అజెండా ఇదే...!!

Telangana Elections 2023: తెలంగాణలో మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారాల గడువు ముగియనుంది. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాలు మగించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో 106 నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. మరో 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల కారణంగా సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. అయితే ప్రచార గడువు ముగిసిన వెంటనే స్థానికేతర నేతలు నియోజకవర్గాన్ని వదివెళ్లాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది.

అయితే ఈరోజు చివరి రోజు కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) గజ్వేల్‌, వరంగల్‌లో ఎన్నికల ప్రచారాలు నిర్వహించనున్నారు. ముందుగా తూర్పు, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గాల నుంచి జన్‌ ఆశీర్వద సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.00PM గంటలకు హెలికాప్టర్‌లో ఎల్‌బీ కాలేజ్‌కు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో కేఎంసీలోని మీటింగ్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని అక్కడ నిర్వహించనున్న సభలో మాట్లాడతారు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు (Gajwel) చేరుకొని అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక నవంబర్ 30 న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు