Telangana Elections: గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కు షాక్ తప్పదా?

సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న మొత్తం 81 మంది పోటీ చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గంలో 44 మంది, కామారెడ్డి నియోజకవర్గంలో 39 మంది బరిలో ఉండనున్నారు.

New Update
Telangana Elections: గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కు షాక్ తప్పదా?

తెలంగాణ ఎన్నికల సమయం దగ్గరపడడంతో రాజకీయ నాయకుల్లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారీ మెజారితో గెలిచారు. ఈసారి ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ప్రస్తుతం అందరి కళ్లు గజ్వేల్, కామారెడ్డి నియోకవర్గాల వైపే ఉన్నాయి.

ALSO READ: ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ను ఓడించేందుకు ఈటల రాజేందర్ బరిలోకి దిగనున్నారు. బీజేపీ తరఫున గజ్వేల్ ఎమ్మెల్యే రేసులో నిలబడ్డారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా తూముకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు. వీరే కాకుండా మొత్తం 111 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అందులో రైతులు కూడా ఉన్నారు. సీఎం కేసీఆర్ తామును మోసం చేశారంటూ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత గజ్వేల్‌ బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారని రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. మొత్తం దాఖలైన 114 నామినేషన్లలో 70మంది అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నట్లు రిటర్నింగ్‌ అధికారి తెలిపారు.

ALSO READ: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ లోకి కీలక నేత!

సీఎం కేసీఆర్ పోటీ చేసే రెండో నియోజకవర్గం కామారెడ్డి. సీఎం కేసీఆర్ ను గద్దె దించేందుకు కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా కె.వెంకట రమణారెడ్డి పోటీలో ఉన్నారు. కామారెడ్డి పగ్గాలు దక్కించుకునేందుకు మొత్తం 58 మంది అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ కాబట్టి 19 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి 39 మంది అభ్యర్థులు బరిలో ఉండనున్నారు.

Advertisment
తాజా కథనాలు