CM KCR speech: తుమ్మల వల్లే పార్టీకి అన్యాయం...పాలేరు సభలో సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

కొందరు పదవుల కోసం పార్టీ మారుతారని తుమ్మల నాగేశ్వరరావుపై పంచులు విసిరారు సీఎం కేసీఆర్. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళకు తగిన గుణపాఠం చెబుతారు అంటూ తుమ్మలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయాలని కోరారు. ఖమ్మం జిల్లా పాలేరు ప్రచార సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

New Update
CM KCR speech: తుమ్మల వల్లే పార్టీకి అన్యాయం...పాలేరు సభలో సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ రోజుకో జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఖమ్మం జిల్లా పాలేరు ప్రచార సభలో పాల్గొన్న ఆయన తనదైన శైలిలో ప్రసంగించారు. పార్టీ వైఖరి గమనించి ప్రజలు ఓటు వేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కొందరు పదవుల కోసం పార్టీలు మారుతున్నారని విమర్శలు గుప్పించారు. పాలేరును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని... బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేశామని అన్నారు. మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఓడిపోయి ఇంట్లో ఉంటే పిలిచి ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవి ఇచ్చామన్నారు. ఇంత చేస్తే ఖమ్మంలో ఆయన పార్టీకి చేసింది గుండు సున్నా అని ఫైర్ అయ్యారు. పైగా తాను మోసం చేశానని ఆయన ఆరోపించడంపై మండిపడ్డారు.

Also Read:కానిస్టేబుల్ ను ఢీకొట్టిన కారు.. ఢిల్లీలో షాకింగ్ ఘటన

పాలేరు ప్రజలకు ఉపేందర్ రెడ్డి ఉండడం అదృష్టమన్నారు. పాలేరులో ఆయనను గెలిపించండి అని కోరారు కేసీఆర్. ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే పాలేరు అంతటా దళితబంధు ఇస్తామని చెప్పారు. రేషన్ కార్డుదారులందరికీ వచ్చే మార్చి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, దళిత బంధు నిలిచిపోతాయని అన్నారు కేసీఆర్.

తాను రైతుబంధు పథకానికి శ్రీకారం చుడితే ప్రముఖ వ్యవసాయవేత్త ఎంఎస్‌ స్వామినాథన్ ప్రశంసించారన్నారు. శభాష్‌ చంద్రశేఖర్‌.. బాగా చేశారంటూ కితాబిచ్చారని సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతు బంధు లాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని యూఎన్‌ఓ కూడా భేష్‌ అన్నదని, తెలంగాణ ప్రభుత్వం బాగా చేసిందని కితాబు ఇచ్చిందని అన్నారు. 24 గంటల ఉచిత కరెంటు వచ్చిన తర్వాత ఈ రోజు రైతుల పరిస్థితి తారుమారైందన్నారు. వాళ్ల బ్యాంకు లోన్లు తీరిపోతున్నాయని అన్నారు. లోన్లు తీసుకునే అవసరం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం కల్తీ విత్తనాలు అమ్మితే.. ఆ అమ్మిన వారిపై పీడీ యాక్ట్‌లు పెట్టి జైళ్లలో పెడుతున్నామన్నారు. బ్రహ్మాండమైన పంటలతో ఏకంగా 3 కోట్ల టన్నుల వరి ధాన్యం తెలంగాణలో పండుతుందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు