CM KCR: అప్పుడు ఎట్లుండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ.. కేసీఆర్ ఆన్ ఫైర్

నేటి నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఏర్పాటు ఆలస్యం అయిందని అన్నారు.

New Update
CM KCR: అప్పుడు ఎట్లుండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ.. కేసీఆర్ ఆన్ ఫైర్

Telangana Elections: ఎన్నికల టైం దగ్గరపడుతోంది. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు నమోదు అవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. వేములవాడ బీజేపీ టికెట్ రాకపోవడంతో తుల ఉమ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా  సీఎం కేసీఆర్ ఈరోజు నుంచి రెండవ విడత ప్రచారం మొదలు పెట్టారు.

ALSO READ: రుణమాఫీపై కీలక అప్డేట్.. చదవండి!

ఇవాళ అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మనదేశంలో ప్రజాస్వామ్య పరిణతి పూర్తిస్థాయిలో రాలేదని అన్నారు. ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పచ్చి అబద్ధాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2004లో ఇవ్వాల్సిన తెలంగాణను పదేళ్లు కాంగ్రెస్ నేతలు ఆలస్యం చేశారని మండిపడ్డారు. సమైక్య పాలకుల వైఖరి వల్ల కొన్ని దశాబ్దాల పాటు వెనకబడిపోయామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని చాలా జిల్లాల నుంచి ప్రజలు వలస వెళ్లేవారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించమని కేసీఆర్ తెలిపారు. కళ్లముందు జరిగిన అభివృద్ధిని గమనించి ఓటు వేయాలని తెలంగాణ ప్రజలను కోరారు.

ALSO READ: సీఎం కేసీఆర్ కు కోటి రూపాయిల అప్పు ఇచ్చిన నేత.. ఎవరంటే?

విద్యుత్‌ కోతల నుంచి బయటపడి 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి వచ్చామని సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్ లేదని విమర్శించారు. గతంలో రైతులను ఆదుకోవాలనే ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలేదని.. రైతుకు పెట్టుబడి స్థిరీకరణ ఉండాలనే ఉద్దేశంతో రైతుబంధు తెచ్చామని వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని అన్నారు. ధరణి పోర్టల్‌ ఉండటం వల్లే రైతుబంధు, రైతు బీమా సాధ్యం అవుతుందని.. ధరణి పోర్టల్ తీసేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.

Advertisment
తాజా కథనాలు