medak: సీఎం కేసీఆర్‌ దళితులకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు

దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదని అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని.. బీఆర్ఎస్‌లో ఉన్న వారికి ఆ పథకాలు అందుతున్నాయని బీజేపీ నేతలు మండి పడుతున్నారు.

medak: సీఎం కేసీఆర్‌ దళితులకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
New Update

మోసం చేస్తున్నారు...

బీఆర్ఎస్‌ ప్రభుత్వం రెండో విడత దళిత బంధు అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపికలో పాదర్శకత చూపిస్తున్నారు. దళిత బంధు విషయంలో దళితులను మోసం చేస్తున్నారని.. అసలైన నిరుపేదలకు దళిత బంధు ఇవ్వటం లేదని బీఆర్ఎస్ అనుచరులకు కాదని బీజేపీ ఎస్సీసి మోర్చా జిల్లా అధ్యక్షుడు మంకిడి స్వామి మండిపడ్డారు. తాజాగా మెదక్‌ జిల్లాలో దళిత బంధు పథకంలో తన పేరు లేదని ఓ యువకుడు ఆత్మహ్యకు యత్నించిని విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ సభకు వెళ్తున్న కార్యకర్తల బస్సు ముందు పినాయిల్ బాటిల్ తాగుతానంటూ హల్‌చల్‌ చేశాడు బేగరి దేవయ్య. నేడు దళిత బంధు విషయంలో బీజేపీ కార్యర్తలు ధర్నా నిర్వహించారు.

ఇచ్చిన హామీలు నేరవేర్చాలి

దళితులను ప్రభుత్వం మోసం చేసిందని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మంకిడి స్వామి అన్నారు. గజ్వెల్ పట్టణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన మరియు ధర్నా నిర్వహించారు. దళితులకు ఇచ్చిన హామీలను, దళిత బంధు, మూడు ఎకరాల భూమీలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మంకిడి స్వామి మాట్లాడుతూ.. కొట్లాడి సంధించుకున్న తెలంగాణ రాష్ట్రలో సీఎం కేసిఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.

ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం..

ముఖ్యంగా దళితులను అన్యాయం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, దళితున్ని సీఎం చేస్తానని మాట తప్పారని, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు ఇస్తానని మోసం చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని అన్నారు. అమాకమైన ప్రజలను మోసం చేసి.. మోసపూరిత మాటలతో డబ్బులు, మద్యంతో కేసీం కేటీఆర్‌ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యదర్శి కూడిక్యాల రాములు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ క్యాతం వెంకట్ రమణ పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్ గౌడ్ మెదక్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సంఖ్య గిరి సురేష్,మహేష్, బీజేవైఎం ఉపాధ్యక్షుడు మనోహర్ యాదవ్ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు దారి యాదగిరి ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నత్తి శివకుమార్ మండల పట్టణ అధ్యక్షులు మధుసూదన్ శ్రీనివాస్‌రెడ్డి, అశోక్, రమేష్, శశిధర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఆకారం అశోక్, ఎస్సీ మోర్చా నాయకులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

#cm-kcr #medak #mankidi-swami #darna #bjp-ledars
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe