ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం? అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఒత్తిడితో సీఎం కేసీఆర్ ఈ దిశగా ఆలోచిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఫస్ట్ లిస్ట్ లోనే అబ్రహం పేరును ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటివరకు ఆయనకు బీఫామ్ అందించలేదు. By V.J Reddy 07 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Alampur MLA Candidate: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వరుస ప్రచారాలతో దూసుకుపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధినేత కేసీఆర్ . తాజాగా కాంగ్రెస్ తరహాలోనే బీఆర్ఎస్ పార్టీలో కూడా టికెట్ల పంచాయతీ షురూ అయిందని ఆ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గులాబీ బాస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీలో దిగే అభ్యర్థుల జాబితాను అన్ని పార్టీల కన్నా ముందుగానే సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అభ్యర్థులందరికీ బీఫామ్ లు అందించిన గులాబీ బాస్ అలంపూర్ (Alampur) అభ్యర్థి అబ్రహంకు మాత్రం ఇంత వరకూ బీఫామ్ ఇవ్వలేదు. దీంతో ఆయనను మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో దూసుకెళ్తున్న కారు.. 57 సర్పంచ్ లు గులాబీ కే! ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మొదటి నుంచి అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ విషయంపై మళ్లీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. చల్లా వెంకట్రామిరెడ్డి విజయుడుకు టికెట్ ఇవ్వాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ పేరునే సీఎం కేసీఆర్ ఫైనల్ చేశారన్న చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. ఈ విషయమై బీఆర్ఎస్ ముఖ్యనేతలు అబ్రహంతో చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. #cm-kcr #telangana-elections #alampur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి