AP: జాగ్రత్త.. ఎమ్మెల్యే అభ్యర్థులకు జగన్ వార్నింగ్! ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూలుతో తమ అభ్యర్థులకు మరింత సమయం లభించిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. దీనిని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకునడవాలంటూ దిశానిర్దేశం చేశారు. By srinivas 18 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Amaravathi: ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూలుతో తమ అభ్యర్థులకు మరింత సమయం లభించిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ సమయాన్ని తమ పార్టీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమైన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిపడా సమయం ఉంది.. ఈ మేరకు మే 13న ఎన్నికలు జరుగుతున్నందున అభ్యర్థులకు సరిపడా సమయం ఉందన్నారు. ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పారు. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామ సచివాలయాన్నీ సదర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. ఈమేరకు అభ్యర్థులు కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు. దీనిపై పార్టీకి చెందిన రీజినల్ కో-ఆర్డినేటర్లు వారికి మార్గనిర్దేశం చేయాలని, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 పార్లమెంటు నియోజకవర్గాల్లో మార్పులు చేశామన్నారు. అభ్యర్థులకు ఇప్పుడున్న సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నారు. కలిసికట్టుగా ముందుకు సాగాలి.. అలాగే ఆయా నియోజకవర్గాలలోని పార్టీ శ్రేణులును, నాయకత్వాన్ని సంఘటితపరిచి, వారిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకునడవాలన్నారు. పార్టీ లక్ష్యం సాధించే దిశలో కలిసి వచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకుని , ఘనవిజయాలు నమోదు చేయాలని జగన్ చెప్పారు. రీజినల్ కో-ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు తమతమ ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుంటూ అభ్యర్థులకు చేదోడు, వాదోడుగా నిలవాలని కోరారు. అలాగే బస్సు యాత్ర ప్రారంభమవుతున్నందున దీనికి అన్నిరకాలుగా సిద్ధంకావాలని, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ సభలు చరిత్రాత్మకం కావాలని శ్రీ జగన్, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు. #ap #cm-jagan #2024-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి