వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన.. సాయం తిరుపై ప్రజలతో ముఖాముఖి

ఈ మధ్య భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ రెండు రోజులు వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అల్లూరి, ఏలూరు, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో ఇటీవల పలు ప్రాంతాలు వరద ముంపునకు గురి అయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించి వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో నేరుగా సీఎం మాట్లాడుతారు. వరద సహాయ, పునరావాస చర్యలు అమలు చేసిన తీరుపై స్వయంగా బాధిత కుటుంబాలను అడిగి మరి తెలుసుకుంటారు సీఎం జగన్‌.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన.. సాయం తిరుపై ప్రజలతో ముఖాముఖి
New Update

CM Jagan visit to Godavari Flood Affected Areas: 

ప్రజలతో స్వయంగా

బాధితుల తరలింపు, పునరావాసశిబిరాల ఏర్పాటు, ఆహారం, మంచినీరు, మందులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. తద్వారా ఉన్నతాధికారులు, సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల సహకారంతో సాయం అందలేదన్న మాటకు తావు లేకుండా చేశారు సీఎం. అయితే.. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడింది. శిబిరాల నుంచి ప్రజలు ఇళ్లకు వెళ్లిపోయారు. అన్ని ప్రాంతాలకు రాకపోకలను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి సాయం అందిన తీరు గురించి ప్రజలతో స్వయంగా మాట్లాడటానికి రెండు రోజుల పర్యటన తలపెట్టారు.

ముప్పుకి గురైన ప్రాంతాలను పరిశీలన

వరదలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులు వరదలతో ముప్పుకి గురైన ప్రాంతాలను పరిశీలించనున్నారు. సోమవారం (ఆగష్ట్‌ 8) తాడేపల్లి నివాసం నుంచి ఏఎస్‌ఆర్‌ జిల్లా (YSR District) కూనవరం మండలం కోతులగుట్ట ఏపీ సీఎం జగన్‌ చేరుకుంటారు. అక్కడ నుంచి గోదావరి (Godavari) వరదల ప్రభావిత ప్రాంతాలు, సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడిన అనంతరం కూనవరం బస్టాండ్‌ సెంటర్‌లో కూనవరం, వీఆర్‌పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు. అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ పరిశీలన అనంతరం వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజమహేంద్రవరం చేరుకోని..అక్కడ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం తర్వాత రాత్రికి అక్కడే బస చేస్తారు సీఎం జగన్‌ (CM Jagan) .

రేపు మధ్యాహ్నం తాడేపల్లికి

రేపు (మంగళవారం) ఉదయం 9.10 గంటలకు రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత తానేలంక రామాలయంపేట గ్రామం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రేపు మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకుంటారు.

Also Read: సర్పంచ్‌, వార్డు మెంబర్ల నామినేషన్ల స్వీకరణ.. పోలింగ్‌..ఫలితాలు అదేరోజు

#ysr-district #alluri #andhra-pradesh-cm-to-visit-flood-affected-areas #ys-jagan-visits-godavari #cm-jagan-visit-to-godavari-flood-affected-areas #konaseema-districts #visit-to-godavari-flood #eluru #cm-ys-jagan #cm-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe