CM Jagan: సీఎం గుడ్ న్యూస్.. రేపు అకౌంట్‌లోకి డబ్బు జమ ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు భీమవరం పర్యటనలో జగనన్న విద్యాదీవెన నిధులను జగన్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా 10 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. By V.J Reddy 28 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి CM Jagan Vidya Deevena : ఏపీ విద్యార్థులకు సీఎం జగన్(CM Jagan) గుడ్ న్యూస్ చెప్పనున్నారు. రేపు జగనన్న విద్యాదీవెన పథకం కింద జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన డబ్బులను సీఎం జగన్ రేపు భీమవరం పర్యటనలో బటన్ నొక్కి డబ్బు జమ చేయనున్నారు. నేరుగా తల్లుల ఖాతాలో ఈ డబ్బు జమ కానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 10 లక్షల మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. మొదటగా ఈనెల 12వ తేదీన కర్నూల్‌లో జరగాల్సిన సభను.. డిసెంబర్ 19వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం డిసెంబర్ 29వ తేదీకి భీమవరంలో ఫైనల్ వేశారు. ఈ పథకం కోసం జగన్ సర్కార్ రూ.15,593 కోట్లు ఖర్చు చేస్తోంది. ALSO READ: రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు షురూ! సీఎం జగన్ అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన(Jagan Vidya Deevena) కింద హాస్టళ్లలో ఉంటూ చదువుకునే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు విడతల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుకునే వారికి రూ.20 వేల చొప్పున జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది జగన్ సర్కార్. సీఎం జగన్ భీమవరం పర్యటన వివరాలు.. * రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలో క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 10.05 గంటలకు తాడేపల్లిలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. * 10.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 10.40 గంటలకు భీమవరం లూథరన్ హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్మించిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. కొద్దిసేపు అక్కడ ప్రజా ప్రతినిధులతో భేటీ అవుతారు. * 10.55 గంటలకు హెలీప్యాడ్ వద్ద నుంచి బయలుదేరి 11.15 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసి సభలో పాల్గొంటారు. * మధ్యాహ్నం 12.30 గంటలకు సభ నుంచి బయల్దేరి లూథరన్ హైస్కూల్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులతో ముచ్చటించనున్నారు. * మధ్యాహ్నం 1.45 గంటలకు లూథరన్ హైస్కూల్ నుంచి హెలికాప్టర్‌లో తాడేపల్లిలోని తన నివాసానికి పయనమవుతారు. ALSO READ: ఓటుకు రూ.3,000.. మహిళలకు పట్టు చీర! #cm-jagan #ap-latest-news #jagananna-vidya-deevena #good-news-for-ap-students మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి