YCP Manifesto : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఓవైపు రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ(YCP).. మరోవైపు జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ-జనసేన-బీజేపీ(TDP-Janasena-BJP) కూటమిలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష నేతలు ఎన్నికల రంగంలోకి దిగిపోయారు. సీఎం జగన్(CM Jagan) మేము సిద్ధం బస్సు యాత్ర పేరుతో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అయితే తాజాగా వైసీపీ మేనిఫెస్టోకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది.
Also read: రైతులకు రూ.20వేలు, 3 గ్యాస్ సిలిండర్లు.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
ఏప్రిల్ 26 సీఎం జగన్ తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. గుంటూరు(Guntur) లోని తాడేపల్లిలో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వైసీపీ ఏం చేస్తుందనే దానిపై క్లారిటీ రానుంది. ఆచరణలో సాధ్యమయ్యే అంశాలతోనే మేనిఫెస్టోను రూపొందించామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాగే పలు జనాకర్షక పథాకాలు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులే టార్గెట్‌గా మేనిఫెస్టో ఉండనున్నట్లు సమాచారం.