CM Jagan: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఉచిత ట్యాబ్ ల పంపిణీ

ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. దీని ద్వారా 4 లక్షల 34 వేల మంది 8వ తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అనంతరం సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు.

CM Jagan: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఉచిత ట్యాబ్ ల పంపిణీ
New Update

Free Tabs For Students: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. సీఎం జగన్ (CM Jagan) ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో (Chinthapalli) ప‌ర్య‌టించ‌నున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు పంపిణీ (Free Tabs Scheme) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న 4 లక్షల 34 వేల మంది 8వ తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 2021లో ఈ పథకాన్ని ప్రకటించిన సీఎం జగన్ మొదటి విడత కింద 4.5లక్షల మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేశారు. తాజాగా ఈ రోజు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ALSO READ: అరెస్ట్ తరువాత పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడంటే..

సీఎం జగన్ ఈ రోజు పర్యటన వివరాలు..

ముఖ్యమంత్రి జగన్ ఉదయం 8.30 గంటలకు తన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చింతపల్లి మండలం చౌడుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి చింతపల్లి చేరుకుని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్ధులతో మాట్లాడిన అనంతరం ట్యాబ్‌లు అందజేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు. మరోవైపు సీఎం జగన్ పర్యటనలో ఎలాంటి తప్పులు జరగకుండా ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.

ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్!

#ap-news #cm-jagan #ysrcp #free-tabs-ap
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe