CM Jagan : వైసీపీలో చిచ్చు పెట్టిన రేవంత్.. ఎంపీలపై సీఎం జగన్ సీరియస్

వైసీపీ ఎంపీలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇచ్చిన విందుకు వైసీపీ ఎంపీలు అటెండ్ అవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత చిన్న విషయానికే సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై వైసీపీ ఎంపీలు అసంతృప్తిగా ఉన్నారట.

New Update
CM Jagan : వైసీపీలో చిచ్చు పెట్టిన రేవంత్.. ఎంపీలపై సీఎం జగన్ సీరియస్

CM Jagan Serious On YCP MP's : తన సొంత పార్టీ ఎంపీలపై సీరియస్ అయ్యారు సీఎం జగన్(CM Jagan). ఇందుకు కారణం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే(TS CM Revanth Reddy).. అదేంటి సీఎం రేవంత్ కు వైసీపీ ఎంపీలకు ఏం సంబంధం అని డౌట్ మీకు రావచ్చు. అసలు ఏమి జరిగిందంటే.. ఇటీవల ఢిల్లీ(Delhi) పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తమ ఎంపీ పదవికి రాజీనామా చేసి అక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర భవన్ ను పరిశీలించారు.. అనంతరం తన సహచర ఎంపీలకు రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, మిగత పార్టీల నుంచి కొంతమంది ఎంపీలు హాజరయ్యారు. అయితే ఈ విందుకు వైసీపీ నుంచి ప్రభాకర రెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు, అయోధ్య రామిరెడ్డి, మస్తాన్‌రావు, వల్లభనేని బాలశౌరి, నిరంజన్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల మాధవ్‌, వంగా గీత, పోచ బ్రహ్మానంద రెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి, చింతా అనూరాధ, బీశెట్టి వెంకటసత్యవతితో పాటు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా హాజరయ్యారు.

ALSO READ: రూ.500లకే గ్యాస్ సిలిండర్ పై కీలక అప్డేట్.. రూల్స్ ఇవే!

అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు వైసీపీ ఎంపీలు వెళ్లడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలను పిలిచి మరీ క్లాస్‌ పీకినట్లు సమాచారం. తనకు తెలియకుండా, పార్టీకి సమాచారం లేకుండా... రేవంత్‌ని ఎంపీలు కలవడంపై సీఎం జగన్‌ అసహనం వ్యక్తం చేశారు. మీరంతా పెద్దవాళ్లు.. మరి ఇలా చేస్తారా... బయటకు సిగ్నల్స్ ఎలా వెళ్తాయి అంటూ వారిని నిలదీశారట. అదే రోజు ఎంపీలకు విందు ఇచ్చారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి విందుకు హాజరై అక్కడ నుంచి నేరుగా రేవంత్‌ ఇచ్చిన విందుకు హాజరైన వైసీపీ ఎంపీలు. ఢిల్లీలో జరిగిన వ్యవహారాన్ని సీఎంకు మిథున్‌రెడ్డి చెప్పారట. ఈ క్రమంలో ఎంపీల తీరుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారట.

ALSO READ: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోజు నుంచే వారికి రూ.2,500?

Advertisment
Advertisment
తాజా కథనాలు