రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందచేయా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS JaganMohan Reddy) లక్ష్యమన్నారు ఏపీఎస్పీడీసీఎల్ (APSPDCL) సీఎండీ సంతోష్ రావు. రైతులు విద్యుత్ కోసం ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు. తిరుపతి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. అగ్రికల్చర్ సర్వీస్‌లో ఒక సర్వీస్‌కు లక్ష యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వెల్లడించారు. అయినా వెనుకాడకుండా రైతుల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు.స్పెషల్ మెయింటెయినెన్స్ కింద ట్రాన్స్ ఫార్మర్లను మరమ్మతులు చేసి 24 గంటల విద్యుత్ అంది చేస్తున్నామన్నారు. గ్రామాలకు కూడా 3 ఫేజ్ సప్లై ఇవ్వాలన్నది ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి ఉందన్నారు.
మీడియా కథనం పూర్తిగా అవాస్తవం
ఏపీఎస్పీడిసిఎల్‌పై కొన్ని మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవం అని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు (CMD Santhosh Rao) పేర్కొన్నారు. బ్రేకర్లు బిడింగ్ ద్వారానే ఇచ్చామని ఆయన తెలిపారు. రీవర్స్ టెండరింగ్ చేసి ట్రాన్స్ పరెంట్‌గా ఉన్నామన్నారు. మెరుగైన బ్రేకర్లు నిర్ణీత సమయంలో అందచేస్తేనే గ్రామాలకు 24 గంటల విద్యుత్ ఇవ్వగలం ఏపీఎస్పీడిసిఎల్ సీఎండీ సంతోష్ రావు తెలిపారు. 50 కోట్ల స్కాం జరిగిందన్న మీడియా కథనం పూర్తిగా అవాస్తవం ఆయన తెలిపారు. తిరుపతిలో ఇప్పటికే సగభాగం వరకు అండర్ కేబుల్ విద్యుత్‌ను అందించనున్నామన్నారు. ప్రధానంగా యాత్రీకులు అధికంగా వస్తుంటారు కనుక స్వామి వారి సన్నిధిలో అండర్ కేబుల్ ద్వారా విద్యుత్ అందచేయాలన్నది ఏపీఎస్పీడిసిఎల్ ముఖ్య ఉద్దేశమని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావు తెలిపారు.
రైతుల పంటలను ప్రభుత్వమే కొనుగోలు
ఏపీలో పంట నష్టపరిహారం, ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పథకాలు వైసీపీ ప్రభుత్వం అంధిస్తోంది. వీటితోపాటు రైతులు పండిస్తున్న పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడంతోపాటు.. విత్తన సబ్సిడీ, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి, ఆయిల్‌పామ్ రైతులకు సబ్సిడీ ఇస్తుంది. పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా కోసం ఫీడర్ల సామర్ధ్యం పెంచ్చింది. రైతుకు అండదండలు అందించేదుకు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసింది. ఇటువంటి ఎన్నో కీలక నిర్ణయాలతో వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ ఉరకలెత్తిస్తున్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీలోకి ఆరెపల్లి మోహన్.. ఘనంగా స్వాగత కార్యక్రమాలు