CM Jagan Ongole Tour: సీఎం జగన్ ఒంగోలు పర్యటన షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 23న ఆయన ఒంగోలులో పర్యటించనున్నారు. ఒంగోలు నగర పరిధిలోని నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి (Tadepalli CM Camp Office) నివాసం నుంచి బయలుదేరి ఒంగోలు మండలం ఎన్.అగ్రహారం చేరుకుంటారు, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం బహిరంగ సభలో (Public Meeting) పాల్గొని ప్రసంగిస్తారు, అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
ALSO READ: మంత్రి బొత్సకు చెక్.. పోటీకి గంటా శ్రీనివాసరావు?
మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బాలినేని
మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసినా.. చేయకపోయినా.. 28 వేల మందికి పట్టాలు పంపిణీ చేసి తీరుతానని తేల్చి చెప్పారు. అర్హులకు భూమి పట్టాలు ఇచ్చేందుకు తాను ఒక్కో రైతు నుంచి రూ.8లక్షలు తీసుకున్నట్లు కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తనను రాజకీయంగా ఎదురుకోలేక.. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు. తాజాగా గతంలో చెప్పినట్టు గానే సీఎం జగన్ చేతులు మీదుగా ఒంగోలులో అర్హులైన ప్రజలందరికి ఇళ్ల పట్టాలు అందించనున్నారు.
175కి 175 ఫిక్స్..
ఏపీ ప్రజలు సీఎం జగన్ (CM Jagan) వైపే ఉన్నారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా వైసీపీదే జోరు అని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు ,జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. తాను వైసీపీలో కొనసాగనున్నట్లు తేల్చి చెప్పారు.
ALSO READ: వైసీపీకి మరోనేత రాజీనామా.. అయోమయంలో సీఎం జగన్
DO WATCH: