YS Jagan : సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసే డేట్, ప్లేస్ ఇదే.. వైసీపీ సంచలన ప్రకటన!

జూన్ 4న జరిగే కౌంటింగ్ లో తమ విజయం ఖాయమన్న ధీమాతో ఉన్న వైసీపీ.. ఏకంగా సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసే డేట్, ప్లేస్ ను సైతం ప్రకటించింది. 9న జగన్ వైజాగ్ లో రెండో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆ పార్టీ అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు.

New Update
YS Jagan : సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసే డేట్, ప్లేస్ ఇదే.. వైసీపీ సంచలన ప్రకటన!

YCP Sensational Announcement : హోరాహోరీగా జరిగిన ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024) విజయంపై అటూ వైసీపీ, ఇటు కూటమి వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఇరు వర్గాలు తాము భారీ విజయం సాధించబోతున్నామని ప్రకటనలు చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా 150కి పైగా సంచలన విజయం సాధిస్తాంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇరు పార్టీల నేతలు. అధికార వైసీపీ మరో అడుగు ముందుకేసి.. జగన్ మళ్లీ సీఎం (CM Jagan) గా ప్రమాణ స్వీకారం చేసే తేదీని సైతం ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ అధికార ట్విట్టర్ (X) ఖాతాలో పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Kodali Nani: కొడాలి నాని ఇచ్చిన పైసలు పంచలేదు.. సంచలన వీడియో!

జూన్ 4న నిర్వహించే కౌంటింగ్ లో వైసీపీ భారీ విజయం సాధించబోతుందని ఆ పోస్టులో పేర్కొంది వైసీపీ. అనంతరం జూన్ 9న విశాఖ (Visakha) లో జగన్ ప్రమాణం చేస్తారని వెల్లడించింది ఆ పార్టీ. పార్టీ శ్రేణులు సంబంరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు నేతలు. ఈ ట్వీట్ పై వైసీపీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ గెలవబోతోందంటూ వారు కామెంట్లు చేస్తున్నారు.

కూటమి అభిమానులు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. వైసీపీ అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసినట్లు జగన్ మళ్లీ విజయం సాధిస్తారా? జూన్ 9న వైజాగ్ లో ఆయన ప్రమాణస్వీకారం చేస్తారా? అన్నది తేలాలంటే జూన్ 4న కౌంటింగ్ వరకు ఆగాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు