CM Jagan: సీఎం జగన్, ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర (AP Congress) అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) మధ్య మరోసారి విబేధాలు బయటపడ్డాయి. కుటుంబ పరంగా జగన్ కి, షర్మిలకు మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఈరోజు జైపూర్ లో షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఘనంగా జరగనుంది (Sharmila Son Marriage). ఈ పెళ్లిని చూసేందుకు వైఎస్ కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. అయితే.. సొంత మేనల్లుడి వివాహానికి సీఎం జగన్ (CM Jagan) హాజరు కావడం లేదు. జనవరి 18న జరిగిన షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్ కు సీఎం జగన్ కుటుంబ సమేతంగా అటెండ్ అయిన విషయం తెలిసిందే.
ALSO READ: జగన్‌కు ఇవే చివరి రోజులు.. చంద్రబాబు హెచ్చరికలు
జగన్ పై షర్మిల విమర్శలే కారణం?..
ఏపీ కాంగ్రెస్ పగ్గాలను చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల సీఎం జగన్, చంద్రబాబులపై (Chandrababu) విమర్శల దాడికి దిగారు. ఏపీలో ఊసే లేని కాంగ్రెస్ పార్టీకి షర్మిల చేరిక బలాన్ని చేకూర్చింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవాలని షర్మిల జిల్లాల టూర్లు చేస్తూ.. గత ప్రభుత్వల వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న తన సొంత అన్న సీఎం జగన్ ను షర్మిల వదలకుండా విమర్శలు చేస్తోంది.
సీఎం జగన్ పాలనలో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిందని.. సీఎం జగన్ చేతకాని తనం వల్లే ఏపీలో అభివృద్ధి జరగలేదని.. మోడీకి జగన్ కట్టుబానిస అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అయితే.. షర్మిల చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఖండించింది.. షర్మిల చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ ను చదువుతుందని ఆరోపణలు చేసింది. దీంతో షర్మిల, జగన్ మధ్య ఉన్న గ్యాప్ ఇంకా పెరిగింది.
ఈ క్రమంలో షర్మిలను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. తనపై షర్మిల చేసిన వ్యాఖ్యల కారణంగానే సొంత మేనల్లుడి పెళ్లికి వెళ్లోద్దని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను వ్యక్తిగత దూషణలు చేయడం లేదని, సిద్ధాంతపరమైన విమర్శలు మాత్రమే చేస్తున్నానని గతంలో వైఎస్ షర్మిల వివరణ ఇచ్చారు.