ఏపీ రాజకీయాల్లో (Ap politics) ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియక రాజకీయ నాయకులు ఫుల్ టెన్షన్ పడుతున్నారు. వైసీపీ నేతలు(YCP Candidates) అయితే తమ పోస్ట్ లు ఉంటాయో ఊడిపోతాయో తెలియక నిద్రాహారాలే మానేశారంటే అతిశయోక్తి కాదు. వారి భయానికి తగినట్లుగానే ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) కూడా ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ అవుతున్నారు.
సీఎం ఆఫీసు నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్ వస్తుందంటేనే వారు భయపడిపోతున్నారు. ఇప్పటికే జగన్ పలువురు ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ అయ్యారు. నియోజకవర్గాల పరిస్థితులు, పార్టీ బలం పై జగన్ అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా భేటీ అయిన ఎమ్మెల్యేల ప్లేస్ లు మార్చుతున్నట్లు సమాచారం రావడంతో ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలైంది.
ఇదిలా ఉంటే జగన్ దృష్టి అంతా కూడా విజయవాడ (Vijayawada) మీద పెట్టినట్లు తెలుస్తోంది. తమకు సీటు రాదు అనుకునే ఎమ్మెల్యేలంతా కూడా జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యి వారు సీట్ పైన కన్ఫర్మేషన్ తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈసారి కూడా ఎలాగైనా ఏపీ లో తాము విజయం సాధించాలని జగన్ గట్టిగా ఉన్నారు.
మరో కొద్ది నెలల్లోనే ఏపీకి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జగన్ తన పార్టీ కార్యకలాపాల మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాగైనా సరే ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరాలని ఎమ్మెల్యేలకు ఆయన గట్టిగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ ఛార్జ్‌లను సైతం ఆయన మార్చారు.
ఈ సమావేశాల్లో జగన్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎంత ముఖ్యమనే అంశాల గురించి ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నట్లు సమాచారం. కొత్తగా ఇన్ ఛార్జ్‌లను నియమించిన సీట్లు దక్కవని ఎవరూ అనుకోవద్దు. పార్టీలో అందరికీ కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని సీఎం చెబుతున్నారు.
Also read: షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌పై ఐటీ రైడ్స్ – రెండో రోజు కొనసాగుతున్నసోదాలు!