CM Jagan: ఫ్యాన్ ఇంట్లో.. సైకిల్ బయట.. గ్లాసు సింక్‌లోనే ఉండాలి: సీఎం జగన్

సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలని అన్నారు సీఎం జగన్. ఫ్యాన్‌ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్‌ ఎప్పుడూ బయటే ఉండాలని.. తాగేసిన టీ గ్లాస్‌ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలని ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు.

New Update
CM Jagan: ఫ్యాన్ ఇంట్లో.. సైకిల్ బయట.. గ్లాసు సింక్‌లోనే ఉండాలి: సీఎం జగన్

CM Jagan: రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు-నేడుతో మార్పులు తెచ్చామని అన్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. విద్యాదీవెన వసతిదీవెనతో విద్యార్థులకు పేదలకు అండగా నిలిచామని అన్నారు. మన పిల్లలు ప్రపంచస్థాయికి ఎదిగేలా విద్యావవస్థలో మార్పులు తెచ్చామన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం అందుబాటులోకి తెచ్చామని గర్వాంగా చెప్పారు. పెత్తందారుల పిల్లలతో మన పిల్లలు పోటీ పడాలంటే మళ్లీ మన ప్రభుత్వ రావాలని పిలుపునిచ్చారు.

ALSO READ: లోకేష్ ఎందుకు గెలవలేదు.. చంద్రబాబుకు ఎమ్మెల్యే బలరాం కౌంటర్

ఫోన్‌లో దిశ యాప్‌..

వైఎస్సార్‌సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఎన్నో పథఖాలు గుర్తుకువస్తాయని అన్నారు సీఎం జగన్. 31 లక్షల ఇళ్ల పట్టాల ఇచ్చిన ప్రభుత్వం మనదని అన్నారు. ప్రతీ అక్క చెల్లెమ్మ ఫోన్‌లో దిశ యాప్‌ తీసుకొచ్చినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలని అన్నారు. ఫ్యాన్‌ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్‌ ఎప్పుడూ బయటే ఉండాలని.. తాగేసిన టీ గ్లాస్‌ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలని ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు. ఎగ్గొట్టేవాడు .. 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తాను అంటాడని చురకలు అంటించారు. మానిఫెస్టో మాయం చేసి .. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తాను అంటాడని ఫైర్ అయ్యారు.

ఏ పార్టీతోనూ పొత్తు లేదు..

వైఎస్సార్‌సీపీ మీ అందరి పార్టీ అని అన్నారు సీఎం జగన్. తమకు ఏ పార్టీతోనూ పొత్తు లేదని.. ప్రజలతోనే మా పొత్తు అని అన్నారు. గతంలో లంచాలు పిండుతూ తన వారికి పథకాలిచ్చారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు నేరుగా ఎటువంటి లంచాలకు తావులేకుండా నేరుగా లబ్ధిదారులు ఖాతాల్లోకే వస్తున్నాయని అన్నారు. ఎన్నికలకు ముందు రంగు రంగుల మేనిఫెస్టోతో హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్క చెల్లెమ్మలను పట్టించుకోకుండా, రైతన్నలను పట్టించుకోకుండా , ఏ ఒక్కరినీ పట్టించుకోకుండా ఆ మేనిఫెస్టోను తీసి చెత్తబుట్టలో వేస్తాడు చంద్రబాబు అని ఫైర్ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు