వారికే ఎమ్మెల్యే టికెట్.. సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందనే దానిపై జరుగుతున్న చర్చకు సీఎం జగన్ తెర వేశారు. ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే దానిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
వారికే ఎమ్మెల్యే టికెట్.. సీఎం జగన్ సంచలన నిర్ణయం

CM Jagan: నేతల మధ్య మాటల యుద్ధంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందనే చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు సీఎం జగన్. ఎమ్మెల్యేల పనితీరు ప్రజలు మేచ్చే విధంగా ఉంటే ఆ ఎమ్మెల్యేలను కొనసాగిస్తామని సీఎం జగన్ తేల్చి చెప్పారు. ప్రజల్లో గ్రాఫ్‌ బాగా లేకపోతే ఆ ఎమ్మెల్యేలను కొనసాగించడం కుదరదని స్పష్టం చేశారు. వాళ్లను అక్కడే కొనసాగించడం వల్ల వారికీ నష్టం, పార్టీకీ నష్టం అని అన్నారు. ఒకవేళ నష్టం చేసే వారికే టికెట్ ఇస్తే కోట్లాది మంది పేదలకూ నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.

ALSO READ: BREAKING: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

18 నుంచి ఆరోగ్యశ్రీ లిమిట్ రూ.25లక్షలకు పెంపు: సీఎం జగన్

వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం కార్యక్రమంపై అధికారులతో ఈ రోజు సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. డిసెంబర్‌ 18న కార్యక్రమం ప్రారంభం కానుంది. సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం టి కృష్ణబాబు, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డి కె బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు