CM Chandrababu : నేడు శ్రీశైలానికి సీఎం చంద్రబాబు

AP: ఈరోజు సీఎం చంద్రబాబు శ్రీశైలం లో పర్యటించనున్నారు. భ్రమరాంభ మల్లికార్జునస్వాముల వారిని దర్శించుకోనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం నీటిపారుదల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

New Update
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వారికి రూ.3 వేలు

Srisailam : ఈరోజు సీఎం హోదాలో తొలిసారి శ్రీశైలంలో పర్యటించనున్నారు చంద్రబాబు (CM Chandrababu). భ్రమరాంభ మల్లికార్జునస్వాముల వారిని దర్శించుకోనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి జలహారతి ఇవ్వనున్నారు సీఎం. అనంతరం నీటిపారుదల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సున్నిపెంటలో ప్రజావేదికలో స్థానికులతో మాట్లాడుతారు. సీఎం రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

చంద్రబాబు పర్యటన పూర్తి వివరాలు..

ఇవాళ నంద్యాల (Nandyal), సత్యసాయి జిల్లా (Satyasai District) ల్లో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయం 9 గంటలకు రెండు జిల్లాల పర్యటనలకు బయలుదేరనున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దర్శనం చేసుకుని జలహారతిలో పాల్గొంటారు. శ్రీశైలం జల విద్యుత్పత్తి కేంద్రాన్ని సందర్శించనున్న ఏపీ సీఎం. సున్నిపెంట గ్రామంలో సాగు నీటి సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి.. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో చంద్రబాబు పర్యటిస్తారు.

Also Read : నిఫ్టీ సరికొత్త రికార్డ్.. 25వేలు దాటి పరుగులు

Advertisment
తాజా కథనాలు