Nifty New History : నిఫ్టీ సరికొత్త రికార్డ్.. 25వేలు దాటి పరుగులు స్టాక్ మార్కెట్ ర్యాలీ కొనసాగుతోంది. నిఫ్టీ చరిత్ర సృష్టించింది. నిఫ్టీ 25వేల పాయింట్ల మార్క్ ను దాటి దూసుకుపోతోంది. By KVD Varma 01 Aug 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి NSE : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ స్టాక్ ఇండెక్స్ నిఫ్టీ 50 సరికొత్త రికార్డు సృష్టించింది. తొలిసారిగా 25,000 పాయింట్ల స్థాయిని దాటింది. స్టాక్ మార్కెట్ (Stock Market) ఈరోజు అంటే గురువారం సరికొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ట్రేడింగ్ సమయంలో, సెన్సెక్స్ (SENSEX) 82,019 మరియు నిఫ్టీ 25,050 ను తాకింది. ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా ఎగబాకి 81,950 స్థాయి వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగింది. 25,050 స్థాయిలో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 24 లాభపడగా, 6 క్షీణించాయి. నేడు ఆటో, మెటల్ మరియు ఎనర్జీ షేర్లలో మరింత దూకుడు కనబరుస్తోంది. US ఫెడరల్ రిజర్వ్ కారణంగానే.. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ బుధవారం నాటి సమావేశ ఫలితాలే స్టాక్ మార్కెట్లలో ఈ చారిత్రాత్మక పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ అమెరికా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, వచ్చే నెలలో అంటే సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గించే బలమైన సూచనను ఇచ్చింది. దీంతో మార్కెట్లో ఇన్వెస్టర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపించి మార్కెట్లోకి డబ్బు వెల్లువెత్తుతోంది. ఫెడరల్ రిజర్వ్ ఈ నిర్ణయం - సిగ్నల్ కారణంగా, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పెరుగుదల కనిపించింది. ఆసియా మార్కెట్ల పతనం ఈరోజు ఆసియా మార్కెట్ (Asia Market) లో క్షీణత కనిపిస్తోంది. జపాన్‌కు చెందిన నిక్కీ 2.58%, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ 0.36% క్షీణించాయి. చైనా షాంఘై కాంపోజిట్ 0.26% క్షీణించింది. సీగల్ ఇండియా లిమిటెడ్ IPO నేడు ప్రారంభం కానుంది. రిటైలర్లు ఆగస్టు 5 వరకు IPO కోసం బిడ్డింగ్ జరుగుతుంది. కంపెనీ షేర్లు ఆగస్ట్ 8న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. అక్మేస్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ IPO సబ్స్క్రిప్షన్ రెండవ రోజు. ఈ స్టాక్ మొదటి రోజు మొత్తం 4.46 సార్లు సబ్‌స్క్రైబ్ అయింది. దాని GMP నేడు 25% చూపుతోంది. జూలై 31న, US మార్కెట్ డౌ జోన్స్ 0.24% పెరుగుదలతో 40,842 వద్ద ముగిసింది. NASDAQ 2.64% వృద్ధితో 17,599 వద్ద ముగిసింది. S&P500 1.58% పెరిగింది. Also Read : ఈరోజు నుంచి మీ జేబు ఖాళీ చేసేవి ఇవే.. కొత్త రూల్స్ తెలుసుకోండి! #nse #bse #stock-market మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి