/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/MODI-CHANDRABABU.jpg)
CM Chandrababu Returns To AP : సీఎం చంద్రబాబు (Chandrababu) ఢిల్లీ పర్యటన (Delhi Tour) ముగిసింది. ఈరోజు ఏపీకి తిరిగి రానున్నారు. ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లిన ఆయన రెండు రోజులపాటు పర్యటించారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ఏపీ అభివృద్ధి విషయంపై పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపు, మెరుగైన రహదారుల నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చలు జరిపారు., అలాగే ఈ పర్యటనలో ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. దాదాపు రెండు గంటల పాటు మోదీ (PM Modi) తో చర్చలు జరిపిన చంద్రబాబు.. ఏపీకి రావాల్సిన నిధులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
ప్రధాని మోదీ గారితో, సీఎం చంద్రబాబు గారు సమావేశం అయ్యారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరారు. పోలవరం, రాజధాని, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి త్వరగా నిధులు అందేలా చూడాలని విజ్ఞప్తి చేసారు.#NaraChandrababuNaidu pic.twitter.com/kU9Fw7wnKf
— Telugu Desam Party (@JaiTDP) August 17, 2024
Also Read : రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు పేరు మారుస్తాం : కేటీఆర్