Andhra Pradesh: రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది.. చంద్రబాబు సంచలన కామెంట్స్

రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో విధ్వంసం సృష్టించారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని.. విపరీతంగా అప్పులు పెంచేశారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని ప్రజారాజధానిగా.. విశాఖను ఆర్థిక రాజధానిగా.. కర్నూల్‌ను మోడల్‌ సిటీగా మారుస్తామని స్పష్టం చేశారు.

New Update
Andhra Pradesh: రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది.. చంద్రబాబు సంచలన కామెంట్స్

రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో ఐదేళ్లుగా విధ్వంసం సృష్టించారని సీఎం చంద్రబాబు విమర్శించారు. గురువారం అమరావతి నిర్మాణాల పరిశీలన అనంతరం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు గల్లాపెట్టే ఖాళీ అయిందని.. విపరీతంగా అప్పులు పెంచేశారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చి.. హైకోర్టులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. డబ్బులు లేవంటూనే రుషికొండలో రూ.500 కోట్లతో భవనాలు నిర్మించారాని ధ్వజమెత్తారు. ఉన్మాది బారి నుంచి దేవుడే రాష్ట్రాన్ని కాపాడారని వ్యాఖ్యానించారు. రౌడియిజం చేస్తే.. నిర్మొహమాటంగా అణిచివేస్తామని హెచ్చరించారు. అమరావతి రైతులు 1631 రోజులు పోరాడని.. అందుకే వైసీపీకి 1+6+3+1 సీట్లు వచ్చాయంటూ ఎద్దేవా చేశారు.

Also Read: జగన్ సంచలన నిర్ణయం.. ఓదార్పు యాత్రకు సిద్ధం!

ఏపీ అంటేనే అమరావతి, పోలవరమని.. ఎవరూ కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రాజధాని నిర్మాణం చేపట్టామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్రం మొత్తానికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో దానిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. ఇక అమరావతిని ప్రజారాజధానిగా.. విశాఖను ఆర్థిక రాజధానిగా.. కర్నూల్‌ను మోడల్‌ సిటీగా మారుస్తామని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం గతంలోనే అన్ని ప్రణాళికలు రూపొందించామన్నారు. అమరావతి రాజధాని కోసం రైతుల చేసిన సుధీర్ఘ పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

Also Read: జగన్ కు ఆ ఖర్మ లేదు.. రుషికొండ భవనాలు కట్టింది ఇందుకే.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్

Advertisment
తాజా కథనాలు