Telangana: ఎమ్మెల్యేపై దాడి.. ఆ నియోజకవర్గంలో హైటెన్షన్..

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. 2 బ్యాగులతో వెళ్తున్న ఓ కారు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉంటున్న ప్రాంతం వైపు ఆగడంతో డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

New Update
BRS Party: 100 రోజుల్లో వంద తప్పులు.. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ విమర్శలు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారు. నియోజకవర్గంలో వెళ్తున్న ఓ కారులో 2 బ్యాగ్‌లు ఉండటాన్ని గుర్తించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వాహనాన్ని వెంబడించారు. అయితే అది ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆగింది. దీంతో కాంగ్రెస్ శ్రేణలు ఆందోళనకు దిగారు. చివరికి కారు అద్దాలు పగలగొడ్డారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టారు.

Also Read: ఎస్ఐ అభ్యర్థులకు హైకోర్ట్ బిగ్ షాక్.. మళ్ళీ పరీక్ష!

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాత్రి 10 తర్వాత ప్రచారం చేస్తూ డబ్బులు పంచుతున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ ఆరోపిస్తున్నారు. అలాగే స్థానిక పోలీసులు కూడా బాలరాజుకు సపోర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే రాష్ట్ర ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

Also Read: మంత్రి కేటీఆర్‌కు రూ. లక్ష చెక్కు అందజేసిన శంకరమ్మ..

Advertisment
తాజా కథనాలు