దారుణం.. బాలుడిపై 108 సార్లు వృత్తలేఖినితో పొడిచారు..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం జరిగింది. ఈ నెల 24న స్కూల్లో ఓ చిన్న గొడవ కారణంగా నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడిపై తోటి విద్యార్థులు వృత్తలేఖినితో 108 సార్లు పొడిచారు. దీంతో బాధిత తండ్రి ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దారుణం.. బాలుడిపై 108 సార్లు వృత్తలేఖినితో పొడిచారు..
New Update

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. ఓ చిన్న గొడవ వల్ల నాలగో తరగతి చదువుతున్న ఓ బాలుడిపై తోటి విద్యార్థులు వృత్తలేఖినితో 108 సార్లు పొడవడం కలకలం రేపింది. ఈనెల 24న ఏరోడ్రోమ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధిత విద్యార్థి తండ్రి పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన కొడుకు గాయాలతో పాఠశాల నుంచి ఇంటికి వచ్చాడని ఆ తండ్రి వాపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించామని తెలిపారు. గొడవ కారణంగా ముగ్గురు విద్యార్థులు తన కొడుకును వృత్తలేఖినితో పొడిచారని చెప్పారు. అయితే ఈ ఘటనపై బాలల సంక్షేమ కమిటీ ఛైర్‌పర్సన్‌ పల్లవి పోర్వాల్ స్పందించారు. దీనిపై నివేదిక ఇవ్వాలంటూ పోలీసులను ఆదేశాలు జారీ చేశారు. అలాగే విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

#telugu-news #crime-news #national-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe