Parliament Security : పార్లమెంటు సెక్యూరిటీ సీఐఎస్ఎఫ్ కు... కేంద్రం కీలక నిర్ణయం By Manogna alamuru 21 Dec 2023 in క్రైం Uncategorized New Update షేర్ చేయండి CISF : పార్లమెంటు భద్రత మీద కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. అత్యంత నిఘా నీడలో ఉండే పార్లమెంటులోకే ఆగంతకులు చొరబడటంతో ఇక్కడి భద్రతా వైఫల్యం మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్లమెంటు భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ - సీఐఎస్ఎఫ్(CISF) కు అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. Also read : కాసేపు ఆగిపోయిన ట్విట్టర్… ఇప్పటి వరకు పార్లమెంటు రక్షన బాధ్యతలను ఢిల్లీ పోలీసులే చూసుకున్నారు. తాజా ఘటనతో ఈ బాధ్యతలను ఢిల్లీ పోలీస్ విభాగం నుంచి తప్పించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ - సీఐఎస్ఎఫ్‌కు అప్పగించింది. దీంతో ఇప్పటి నుంచి ఢిల్లీ(Delhi) పోలీసులకు బదులుగా సీఐఎస్ఎఫ్ బలగాలు పార్లమెంటు లోపల, పార్లమెంటు ఆవరణలో భద్రతను కూడా చూసుకోనుంది. పార్లమెంటు లోపలికి ప్రవేశించే వారిని సీఐఎస్ఎఫ్ సిబ్బందే ఫ్రిస్కింగ్ చేయనున్నారు. పార్లమెంట్ కాంప్లెక్స్ భద్రతా బాధ్యత లోక్‌సభ సెక్రటేరియేట్ చేతుల్లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సీఐఎస్ఎఫ్ బృందం ముందు పార్లమెంటు మొత్తం సర్వే చేపట్టాలని కేంద్ర హోంశాఖ ఆదేశించిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీని తర్వాత మొత్తం సీఐఎస్ఎఫ్ సిబ్బందిని మార్లమెంటులో మోహరిస్తాని తెలిపారు. గవర్నమెంట్ బిల్డింగ్ సెక్యూరిటీ నిపుణులు, ఫైర్ యూనిట్ సభ్యులు...పార్లమెంటు భద్రతా బృందాలతో కలిసి ఈ వీకెండ్ లో సర్వే చేయనున్నారు. ఇక సీఐఎస్ఎఫ్ కింద ప్రస్తుతం పార్లమెంటు భద్రతను పర్యవేక్షిస్తున్న సెక్యూరిటీ సర్వీసెస్, ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ డ్యూటీ గ్రూప్ బృందాలు కూడా పని చేస్తాయని చెప్పారు. మరోవైపు పార్లమెంటు మీద దాడి చేసిన వారిని పోలీసులుల ఇంటరాగేట్ చేస్తున్నారు. వారు ప్లాన్ చేసిన ప్రదేశాలకు తీసుకువెళ్ళి...నిందితుల ఫోన్లను రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. #attack #cisf #security #new-parliament మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి