Nagarjuna: నాగార్జునకు భారీ ఊరట
తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు భారీ ఊరట లభించింది. మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన 'N-కన్వెన్షన్' కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ హైకోర్టులో హీరో నాగార్జునకు భారీ ఊరట లభించింది. మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన 'N-కన్వెన్షన్' కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హీరో రవితేజ కుడి చేతికి సర్జరీ అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రవితేజ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. "ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని. తన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు."
N-కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున స్పందించారు.' కూల్చివేత చేపట్టడం బాధాకరం. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. అది పట్టా భూమి. కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. దీనికోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం' అంటూ ఎక్స్ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు.
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ -ప్రభాస్ వివాదంతో సోషల్ మీడియాలో టాలీవుడ్, బాలీవుడ్ మధ్య వార్ మొదలైంది. టాలీవుడ్ ను అనేటప్పుడు మీ బతుకులేంటో తెలుసుకోండి, ప్రభాస్‌ని అనే రేంజా మీది? కల్కి క్లైమాక్స్ లోప్రభాస్ ఎంట్రీ సీన్ ఒక్కటి చాలు మీకు' అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.
ప్రభాస్ - అర్షద్ వివాదంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.' నార్త్-సౌత్, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్.. ఇలా పోలుస్తూ వెనక్కి వెళ్లొద్దు. అర్షద్ కొంచెం హుందాగా మాట్లాడాల్సింది. 'కల్కి' రెండోభాగంలో ప్రభాస్ ను బెస్ట్‌గా చూపిస్తాను' అని అన్నారు.
బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ లేటెస్ట్ సీజన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెస్ట్ గా రాబోతున్నారట. బాలయ్య, రేవంత్ రెడ్డి ఇద్దరికి మంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే బాలయ్య అడిగిన వెంటనే రేవంత్ రెడ్డి ఓకే చెప్పినట్లు సమాచారం.
యంగ్ బ్యూటీ శ్రీలీలకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్లు తాజా సమాచారం. సిద్దార్థ్ మల్హోత్ర కథానాయకుడిగా ‘మిట్టి’ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శ్రీలీల ఓ కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది. అక్టోబర్‌లో ఈ సినిమా మొదలు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ హీరో నాని కాలినడకన తిరుమల చేరుకున్నారు. తన సతీమణి అంజన, తనయుడు అర్జున్‌తోపాటు తన కొత్త సినిమా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్‌తో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీ అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 6 లేదా 7న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.